రూ.8999 కే 50MP, 5000mAh బ్యాటరీ 5G ఫోన్.. సంవత్సరం Replacement గ్యారంటీ..!
ప్రముఖ ఫీచర్ ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ HMD.. భారత్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ సహా రెండు ఫీచర్ ఫోన్‌లను లాంచ్ చేసింది. HMD Vibe 5G పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చింది. దీంతోపాటు సంవత్సరం వరకు రీప్లేస్‌మెంట్ గ్యారంటీని కూడా అందిస్తామని హామీ ఇచ్చింది. HMD 101 4G, HMD 102 4G ఫీచర్ ఫోన్‌లను 1000mAh డిస్‌ప్లేతో లాంచ్ చేసింది.
HMD వైబ్ 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 6nm Unisoc T760 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ రెండు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరా, LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.2, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్‌లు, నోటిఫికేషన్ లైట్, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
HMD 101 4G, 102 4G ఫీచర్ ఫోన్‌ల వివరాలు :
ఈ రెండు ఫీచర్ ఫోన్‌లు 2 అంగుళాల QQVGA (240 x 320 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మరియు Unisoc 8910 FF-2 చిప్‌సెట్, S30+ RTOS పైన పనిచేస్తోంది. హెచ్‌ఎండీ 102 4G ఫోన్ QVGA కెమెరా, ఫ్లాట్ లైట్‌ను కలిగి ఉంది.
ఈ రెండు ఫోన్‌లు (HMD 101 4G) 1000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. MP3, FM రేడియో, క్లౌడ్ యాప్స్‌ను సపోర్టు చేస్తుంది. మరియు IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. డ్యూయల్ సిమ్ కార్డులను సపోర్టు చేస్తాయి.
HMD స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్‌ల ధర, సేల్ వివరాలు :
HMD వైబ్ 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.11999 గా ఉంది. లాంచ్ సేల్ ఆఫర్‌లో భాగంగా రూ.8999 కే కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. HMD వైబ్ 5G స్మార్ట్‌ఫోన్ పర్పుల్, బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ పై సంవత్సరం రీప్లేస్‌మెంట్ గ్యారంటీని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
HMD 101 4G, HMD 102 4G ఫీచర్ ఫోన్‌లను రూ.1899, రూ.2199 ధరలకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఈ ఫీచర్, స్మార్ట్‌ఫోన్‌లు HMD ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్, రిటైల్ స్టోర్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని HMD తెలిపింది. HMD 101 4G ఫోన్ రెడ్, డార్క్ బ్లూ, బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అదే 102 4G మోడల్ రెడ్, డార్క్ బ్లూ, పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications