Home
Mobile

చిన్నారుల కోసం ప్రత్యేక ఫోన్‌.. కాలింగ్‌, SMS, లొకేషన్‌ ట్రాకింగ్‌ ఫీచర్లు సహా..!

HMD గ్లోబల్‌ సంస్థ చిన్నారుల కోసం ప్రత్యేక ఫోన్‌ ను తీసుకురానుంది. HMX XploraOne పేరుతో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌ కోసం ప్రముఖ సంస్థ XploraOne తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఫోన్‌ త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ వివరాలతో కూడిన మైక్రోసైట్ Xplora వైబ్‌సైట్‌ లో ప్రారంభం అయింది. ఈ ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

చిన్నారుల కోసం ప్రత్యేకంగా :
చిన్నారుల భద్రత సహా ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్‌ ను తీసుకొస్తున్నట్లు చెబుతున్నాయి. హానికరమైన కంటెంట్‌ ను నియంత్రించి, చిన్నారులకు అవసరం అయిన కాలింగ్‌, SMS సహా GPS ట్రాకింగ్‌ సౌకర్యంతో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.

HMD XploraOne phone for children with calling location tracking features may launch soon in india

పేరెంటల్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ :
హెచ్‌ఎండీ XploraOne స్మార్ట్‌ఫోన్‌ ముందు, వైనుక వైపు కెమెరాలు ఉంటాయి. దీంతోపాటు గ్యాలరీ, క్యాలెండర్‌ సహా మరిన్ని యాప్‌ లు ఉండనున్నాయి. దీంతోపాటు భద్రతాపరంగా పేరెంటల్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంటుంది. అంటే చిన్నారుల ఫోన్‌ ను వారి తల్లితండ్రులు నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది.

ఇన్‌బిల్ట్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ :
చిన్నారుల ఫోన్‌లోని కాంటాక్ట్‌ లిస్ట్‌ లో మార్పులు చేయవచ్చు. కొత్త నంబర్లను నమోదు చేయడం సహా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. మరియు బ్లాక్‌ చేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ లో ఉండే ఇన్‌బిల్ట్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ ఫీచర్ల ఆధారంగా చిన్నారుల కదలికలను ట్రాకింగ్ చేయవచ్చు.

అంచనా స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు లీక్‌ :
టిప్‌స్టర్‌ @smashx_60 వివరాల ఆధారంగా హెచ్‌ఎండీ XploraOne ఫోన్‌ 3.2 అంగుళాల 2.5D కర్వడ్ QVGA IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ USB-C ఛార్జింగ్‌ సపోర్టుతో 2000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు IP52 రేటింగ్‌ తో డ‌స్ట్‌, స్ప్లాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

చిప్‌సెట్! :
ఈ హెచ్‌ఎండీ ఫోన్ Unisoc T127 చిప్‌ తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌ 64MB ర్యామ్‌, 128MB స్టోరేజీని సపోర్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మైక్రో SD కార్డు ద్వారా 32GB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

జెమిని ఏఐ మోడల్‌ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 2MP కెమెరా, ముందు వైపు 0.3MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌, వైఫై, GPS, FM రేడియో వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. దీంతోపాటు జెమిని AI మోడల్‌ ను కూడా సపోర్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఫిజికల్‌ నేవిగేషన్‌ బటన్‌లు :
ఈ ఫోన్‌ ఫిజికల్‌ నేవిగేషన్‌ బటన్‌ లను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఛార్‌కోల్‌, సియాన్‌ బ్లూ కలర్ వేరియంట్స్‌ లో లభిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌ లపై HMD ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
HMD XploraOne phone for children with calling location tracking features may launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X