ఏప్రిల్ 19న Honor 10, మే 15న Honor 10 Pro, హైలెట్ ఫీచర్లు ఇవే

దిగ్గజ చైనా మొబైల్ సంస్థ హువాయి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ 10ను ఈ నెల 19వ తేదీన విడుద‌ల చేయ‌నుంది.

|

దిగ్గజ చైనా మొబైల్ సంస్థ హువాయి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ 10ను ఈ నెల 19వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. అయితే దీని ధ‌ర వివ‌రాల‌ను కంపెనీ ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో 5.84 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 16, 24 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాల‌ను అమర్చ‌గా, ముందు భాగంలో 24 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు నాణ్యంగా ఉంటాయి.కాగా ఈ ఫోన్లు పీ20 సీరిస్ ఫోన్లను పోలి ఉంటాయని కంపెనీ చెబుతోంది. కాగా ఇప్పటికే మీడియాకు ఆహ్వానాలు కూడా పంపింది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన ప్రోమో చిత్రాలు అలాగే స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి.

honor 10

హాన‌ర్ 10 ఫీచ‌ర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 24 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3320 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

రూ.200కే Jio టీవి సేవలు, సిమ్‌తో జియో ల్యాపీలు, రిలీజ్ తేదీ ఎప్పుడంటే ?రూ.200కే Jio టీవి సేవలు, సిమ్‌తో జియో ల్యాపీలు, రిలీజ్ తేదీ ఎప్పుడంటే ?

కాగా ఈ రెండు ఫోన్లలో సెల్ఫీకెమెరానే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 20 ఎంపీ కెమెరాతో పాటు AI camera featuresని పొందుపరిచారు. దీంతో పాటు 100 ఢిఫరెంట్ అబ్జెక్ట్స్ ను గుర్తించేలా ఈ కెమెరా ఫీచర్ రానుంది. అయితే కొన్ని ఫీచర్లు మాత్రమే బయటకు వచ్చాయి. పూర్తి స్థాయి ఫీచర్లు మాత్రం ఏప్రిల్ 19న లాంచింగ్ టైంలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ధర వివరాలు కూడా కంపెనీ అప్పుడే ప్రకటించనుంది. కాగా హానర్ 10 ప్రొ మాత్రం మే నెల 15వ తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Honor 10 Full Specifications Leaked through TENAA Ahead of April 19th Launch: Expected Price in India, Features More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X