జనవరి 15న ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్న హానర్ 10 లైట్
చైనా దిగ్గజం హువాయి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయబోతుంది .గతంలో వచ్చిన హానర్ 10కి సక్సెసర్ వెర్షన్ గా హానర్ 10 లైట్ ను మార్కెట్లో విడుదల చేయనుంది.
చైనా దిగ్గజం హువాయి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయబోతుంది .గతంలో వచ్చిన హానర్ 10కి సక్సెసర్ వెర్షన్ గా హానర్ 10 లైట్ ను మార్కెట్లో విడుదల చేయనుంది. అన్ని కుదిరితే ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ జనవరి 15న జరగనుంది. ఇందులో 6.21 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 4/6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చగా, ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు నాణ్యంగా ఉంటాయి.ఈ హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్ ను మిడ్‌నైట్ బ్లాక్, వైట్, గ్రేడియెంట్ బ్లూ కలర్ వేరియెంట్లలో విడుదల చేయనుంది.

ధర(అంచనా)....
4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,400 ఉండే అవకాశం ఉంది.
6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.17,450 ఉండే అవకాశం ఉంది.
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.19,500 ఉండే అవకాశం ఉంది.

హానర్ 10 లైట్ ఫీచర్లు...
6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

గతంలో వచ్చిన హానర్ 10 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి....
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3320 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








