భారీ డిస్‌ప్లేతో మార్కెట్లో లాంచ్ అయిన హానర్ 10 లైట్

చైనా దిగ్గజం హువాయి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పటికే గత మే లో హానర్ 10 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసిన సంగతి తెల్సిందే

|

చైనా దిగ్గజం హువాయి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పటికే గత మే లో హానర్ 10 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసిన సంగతి తెల్సిందే .అయితే ఇప్పుడు దానికి సక్సెసర్ వెర్షన్ గా హానర్ 10 లైట్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 6.21 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 4/6 జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాల‌ను అమర్చ‌గా, ముందు భాగంలో 24 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు నాణ్యంగా ఉంటాయి.ఈ హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్ ను మిడ్‌నైట్ బ్లాక్, వైట్, గ్రేడియెంట్ బ్లూ కలర్ వేరియెంట్లలో విడుదల చేసింది హువాయి కంపెనీ .అయితే దేశీయ మార్కెట్లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి....

ఐడియా రూ.189 ప్లాన్‌లో భారీ మార్పులు, అదనపు డేటాఐడియా రూ.189 ప్లాన్‌లో భారీ మార్పులు, అదనపు డేటా

ధర....

ధర....

4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,370 గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.17,450గా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.19,500 గా నిర్ణయించారు.

హానర్ 10 లైట్ ఫీచర్లు...

హానర్ 10 లైట్ ఫీచర్లు...

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

గతంలో వచ్చిన హానర్ 10 ఫీచ‌ర్లు ఈ విధంగా ఉన్నాయి....

గతంలో వచ్చిన హానర్ 10 ఫీచ‌ర్లు ఈ విధంగా ఉన్నాయి....

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 24 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3320 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Best Mobiles in India

English summary
Honor 10 Lite With 6.2-Inch Display, Up to 6GB RAM, Kirin 710 SoC Launched: Price, Specifications.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X