ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన హానర్ 10 లైట్ ధర ఎంతంటే...?

చైనా దిగ్గజం హువాయి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది .గతంలో వచ్చిన హానర్ 10కి సక్సెసర్ వెర్షన్ గా హానర్ 10 లైట్ ను మార్కెట్లో విడుదల చేసింది .

|

చైనా దిగ్గజం హువాయి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది .గతంలో వచ్చిన హానర్ 10కి సక్సెసర్ వెర్షన్ గా హానర్ 10 లైట్ ను మార్కెట్లో విడుదల చేసింది .ఇందులో 6.21 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 4/6 జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాల‌ను అమర్చ‌గా, ముందు భాగంలో 24 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు నాణ్యంగా ఉంటాయి.ఈ హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్ ను మిడ్‌నైట్ బ్లాక్, వైట్, గ్రేడియెంట్ బ్లూ కలర్ వేరియెంట్లలో విడుదల చేసింది.ఈ ఫోన్ యొక్క సేల్స్ జనవరి 20నుంచి మొదలు కానుంది.

 

వాట్సాప్‌లో ఆ మెసేజ్ పై క్లిక్ చేస్తే అంతే సంగతులువాట్సాప్‌లో ఆ మెసేజ్ పై క్లిక్ చేస్తే అంతే సంగతులు

ఫీచర్లు...

ఫీచర్లు...

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర...

ధర...

4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.13,999

6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.17,999

 

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే....
 

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే....

ఇందులో 6.21 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫిక్సల్ రిజల్యూషన్ 2340 x 1080 గా ఉంది. యూజర్లకు మంచి వ్యూయింగ్ అనుభూతిని కలిగించేదుకు ఈ భారీ డిస్‌ప్లే తోడ్పడనుంది.

కెమెరా విషయానికొస్తే....

కెమెరా విషయానికొస్తే....

వెనుక భాగంలో 13+2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న కెమెరాల ను ఇచ్చారు . దీని ద్వారా ఫోటో తీసుకున్నప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముందు భాగం లో సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్...

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్...

అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన octa-core processorతో పాటు Kirin 710తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ/6జీబీ ర్యామ్ 64/128 జీబీ స్టోరేజ్ లలో లభ్యమవుతోంది.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ...

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ...

ఈ హానర్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3440 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

గతంలో వచ్చిన హానర్ 10 ఫీచ‌ర్లు ఈ విధంగా ఉన్నాయి....

గతంలో వచ్చిన హానర్ 10 ఫీచ‌ర్లు ఈ విధంగా ఉన్నాయి....

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 24 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3320 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Best Mobiles in India

English summary
Honor 10 Lite with Kirin 710, waterdrop-style notch launched in India: Price, specifications.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X