ఊరిస్తున్న ఆ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది
హువాయి సబ్ బ్రాండు హానర్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 10ను చైనాలో లాంచ్ చేసింది. ఐఫోన్ ఎక్స్ మాదిరి నాచ్ డిస్‌ప్లే డిజైన్‌తో హానర్ 10ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
హువాయి సబ్ బ్రాండు హానర్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 10ను చైనాలో లాంచ్ చేసింది. ఐఫోన్ ఎక్స్ మాదిరి నాచ్ డిస్‌ప్లే డిజైన్‌తో హానర్ 10ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా కూడా కంపెనీ లాంచ్ చేయబోతోందని తెలుస్తోంది. బ్లాక్, గ్రే, మిరేజ్ బ్లూ, మిరేజ్ పర్‌పుల్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర 2,600 సీఎన్‌వై( సుమారు రూ.27,300), టాప్ వేరియంట్ ధర 2,800 సీఎన్‌వై(రూ.29,400)గా కంపెనీ పేర్కొంది. కాగా ఇటీవలే హువావే పీ20, పీ20 ప్రొ స్మార్ట్‌ఫోన్లను ఈ కంపెనీ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

హానర్ 10 స్పెషిఫికేషన్లు
5.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్‌ప్లే
ఇన్-హౌజ్ కిరిన్ 970 ప్రాసెసర్
6జీబీ ర్యామ్
64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లు
వెనుకవైపు 16 మెగాపిక్సెల్, 24 మెగాపిక్సెల్ డ్యూయల్ సెన్సార్లు
ముందు వైపు 24 మెగాపిక్సెల్ కెమెరా
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు

Huawei P20, P20 Pro
ఈ నెల 24న ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 52,900, రూ.72,300గా ఉండే అవకాశం ఉంది.
హువావే పీ20 ఫీచర్లు
5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
హువావే పీ20 ప్రొ ఫీచర్లు
6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ OLED డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, octa-core Huawei HiSilicon Kirin 970 SoC, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 40 ఎంపీ, మరొకటి 20 ఎంపీ, మూడోది 8 ఎంపీ సెన్సార్ల కెమెరాలు, 24.8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, NFC, and USB Type-C, 4000mAh battery,7.8mm of thickness, fast charging technology, 30 నిమిషాల్లో 58 శాతం బ్యాటరీ ఛార్జ్.

రెండు ఫోన్లలో
ఈ రెండు ఫోన్లలో 5.84 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 16, 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చగా, ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు నాణ్యంగా ఉంటాయి.

రెండు ఫోన్లలో సెల్ఫీకెమెరానే
కాగా ఈ రెండు ఫోన్లలో సెల్ఫీకెమెరానే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 20 ఎంపీ కెమెరాతో పాటు AI camera featuresని పొందుపరిచారు. దీంతో పాటు 100 ఢిఫరెంట్ అబ్జెక్ట్స్ ను గుర్తించేలా ఈ కెమెరా ఫీచర్ రానుంది.


Click it and Unblock the Notifications