50MP+ 50MP + 12MP వెనుక కెమెరాలు, రెండు సెల్ఫీ కెమెరాలతో హానర్ 5G స్మార్ట్‌ఫోన్.. జులై 18న విడుదల..!
హానర్ 200 సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో జులై 18 న విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా హానర్ 200 5G, హానర్ 200 ప్రో 5G మోడళ్లు (Honor 200 5G Series) లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ కీలక వివరాలను సంస్థ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు వెనుకపైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అత్యంత నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంది. మరియు మరిన్ని కెమెరా ఫీచర్‌లు, ఎఫెక్ట్‌లను కలిగి ఉండనుంది. Harcourt వైబ్రంట్, కలర్, క్లాసిక్ వంటి ఎఫెక్ట్‌లతో వస్తుంది.
హానర్ 200 5G సిరీస్ కెమెరా స్పెసిఫికేషన్‌లు :
హానర్ వెబ్‌సైట్ ఆధారంగా హానర్ 200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS సపోర్టుతో 50MP పొర్ట్రెయిట్ కెమెరా మరియు OIS సపోర్టుతో 2.5X ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ IMX 856 టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ ప్రో మోడల్ రెండు సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. f/2.1 అపేచర్‌తో 50MP పొర్ట్రెయిట్ సెల్ఫీ కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ముందు, వెనుక కెమెరాలు 4K నాణ్యతతో కూడిన వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రో మోడల్ అధిక నాణ్యమైన వీడియోల కోసం ప్రో వీడియో మోడ్ ను కలిగి ఉంటుంది.
హానర్ 200 5G స్మార్ట్‌ఫోన్ OIS సపోర్టుతో 50MP 1/1.56 అంగుళాల సోనీ IMX906 కెమెరాను కలిగి ఉంది. మరియు 50MP సోనీ IMX856 టెలిఫోటో కెమెరాను అమర్చారు. అయితే మరో కెమెరా వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఈ బేస్ వేరియంట్ కూడా ప్రో మోడల్ తరహా సెల్ఫీ కెమెరాలను కలిగి ఉండనుంది.
దీంతోపాటు ఈ హానర్ 200 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మరిన్ని కెమెరా ఫీచర్‌లు, ఎఫెక్ట్‌లను కలిగి ఉండనుంది. Harcourt వైబ్రంట్, కలర్, క్లాసిక్ వంటి ఎఫెక్ట్‌లతో వస్తుంది. దీంతోపాటు తక్కువ కాంతి మరియు ఇతర పరిస్థితుల్లో మెరుగైన ఫోటోల కోసం AI ఆధారిత నైట్ పోర్ట్రెయిట్ మోడ్‌ను కలిగి ఉంది.
హానర్ 200 ప్రో 5G యూరోపియన్ వేరియంట్ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 66W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత MagicOS 8.0 skin మరియు స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








