Home
Mobile

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో రూ.15,998 ధరకే 108MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌..!

పండగ సీజన్‌లో భాగంగా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్ 2024 (Amazon), ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరుతో సేల్‌ (Flipkart) నిర్వహిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో భాగంగా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌లతోపాటు ఎంట్రీ లెవల్‌, మిడ్‌రేంజ్ హ్యాండ్‌సెట్‌లను మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.15000 ధర సెగ్మెంట్‌లో బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ కోసం ఎదురుచూసేవారికి అమెజాన్‌లో 108MP కెమెరాతో హ్యాండ్‌సెట్‌ అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఈ నెలలోనే విడుదల అయింది. 5-స్టార్‌ డ్రాప్‌ రిసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లపై చెడు ప్రభావం చూపకుండా ఉండేలా ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది.

హానర్‌ 200 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల భారత్‌లో విడుదల అయింది. అమెజాన్‌ పేజీ ఆధారంగా బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.15,998 కే సొంతం చేసుకోవచ్చు. హానర్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ మరియు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. స్టారీ బ్లూ, సియాన్ లేక్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

Honor 200 Lite 5G Smartphone gets rs2000 discount

హానర్‌ 200 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ (Honor 200 Lite 5G Smartphone) 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2412 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 93.7 శాతం స్క్రీన్‌ టూ బాడీ యాస్పెక్ట్‌ రేషియోతో అందుబాటులో ఉంది. SGS 5-స్టార్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆక్టాకోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ Mail G57 GPU, 8GB LPDDR4X ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత MagicOS 8.0 ను కలిగి ఉంది.

Honor 200 Lite 5G Smartphone gets rs2000 discount

హానర్‌ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విభాగం పరంగా వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలతో అందుబాటులో ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) f/1.75 అపేచర్‌తో 108MP AI పొర్ట్రెయిట్‌ కెమెరా, f/2.2 అపేచర్‌తో 5MP అల్ట్రా వైడ్‌ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. మరియు f/2.1 అపేచర్‌తో 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

హానర్‌ 200 లైట్‌ 5G హ్యాండ్‌సెట్‌ 35W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 802.11, బ్లూటూత్‌ 5.1, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor 200 Lite 5G Smartphone gets rs2000 discount on amazon great indian festival sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X