108MP ప్రధాన కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ ప్రకటన.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!
హానర్ 200 సిరీస్ ఇటీవల భారత్‌లో విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా హానర్ 200 మరియు హానర్ 200 ప్రో హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. అయితే ఈ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ హానర్ 200 లైట్ (Honor 200 Lite Smartphone Launch Date) త్వరలో విడుదల కానుంది. అయితే గత రెండు హ్యాండ్‌సెట్‌ల కంటే లైట్ మోడల్ తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంటుంది.
హానర్ ప్రకటన ఆధారంగా హానర్ 200 లైట్ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 19వ తేదీన విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ వివరాలను కూడా హానర్ వెల్లడించింది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సహా సంస్థ అధికారిక స్టోర్‌ల ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ హానర్ 200, ప్రో మోడళ్ల తరహాలోనే లైట్ మోడల్ కూడా నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంటుంది.

108MP ప్రైమరీ కెమెరా :
ఇప్పటికే హానర్ 200 లైట్ కెమెరా వివరాలను ఇప్పటికే వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.75 అపేచర్‌తో 108MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు f/2.2 అపేచర్‌తో డెప్త్ కెమెరా, f/2.4 అపేచర్‌తో మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది.
50MP సెల్ఫీ కెమెరా :
వెనుక వైపు ఉన్న కెమెరాలు వివిధ పొర్ట్రెయిట్ మోడ్‌లను కలిగి ఉంటుంది. 1x ఎన్విరాన్‌మెంట్ 2x అట్మాస్‌పియరిక్, 3x క్లోజ్ అప్ మోడ్‌లను కలిగి ఉంటుందని హానర్ వెల్లడించింది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ సెల్ఫీ కెమెరా AI వైడ్ యాంగిల్ సెల్ఫీ ఫీచర్‌తో పనిచేస్తుంది.
ఈ హానర్ 200 లైట్ డిజైన్‌ను సంబంధించిన కొన్ని వివరాలను ధ్రువీకరించింది. SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ చేజారి కిందపడినా డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.78mm థిక్‌నెస్, 166 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ స్టారీ బ్లూ, సియాన్ లేక్, మిడ్‌నైట్ బ్లూక్ మూడు రంగుల్లో లభిస్తుందని హానర్ వెల్లడించింది.
ఇటీవల అందుబాటులోకి వచ్చిన హానర్ 200 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల 1.5k అమోలెడ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే ప్రో మోడల్ 6.78 అంగుళాల 1.5k క్వాడ్ కర్వడ్ ఫ్లోటింగ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు మోడళ్లు 120Hz రీప్రెష్ రేట్, 4000 నిట్స్ HDR గరిష్ఠ డిస్‌ప్లేను కలిగి ఉంది.
హానర్ 200 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. అదే ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత MagicOS 8.0 ను కలిగి ఉంటుంది. ఈ హానర్ 200 సిరీస్ AI ఆధారిత ఫీచర్‌లతో అందుబాటులోకి ఉంది. మేజిక్LM, మేజిక్ క్యాప్సుల్, మేజిక్ పొర్టల్, మేజిక్ రింగ్, మేజిక్ Anywhere Door వంటి ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








