ధర రూ.15,999 కే 108MP కెమెరా + 50MP సెల్ఫీ కెమెరా, 256GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, సేల్ వివరాలు..
హానర్ నుంచి ఇటీవల హానర్ 200 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు (Honor 200 Lite Smartphone) విడుదల అయ్యాయి. తాజాగా ఇవాళ ఈ సిరీస్‌లో లైట్ మోడల్‌ను లాంచ్ చేసింది. తొలిసారిగా రూ.20000 ధర సెగ్మెంట్‌లో హానర్ 200 లైట్ 5G హ్యాండ్‌సెట్‌ను హానర్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్ 108MP ప్రైమరీ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 256 స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. డిజైన్ పరంగాను ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం హానర్ భారత్‌లో తిరిగి విక్రయాలు ప్రారంభించాక.. హానర్ X9b, హానర్ 200 సిరీస్‌ను లాంచ్ చేసింది.
హానర్ 200 లైట్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
హానర్ 200 లైట్ స్మార్ట్‌ఫోన్ (Honor New Smartphone) 6.7 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2412 పిక్సల్ రిజల్యూషన్, 90Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది.

ఈ హానర్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత MagicOS 8.0 OS ను కలిగి ఉంది. మరియు ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్ Mail G57 GPU, 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీలో అందుబాటులో ఉంటుంది.
108MP + 50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా హానర్ 200 లైట్ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.75 అపేచర్, OIS సపోర్టుతో 108MP AI పొర్ట్రెయిట్ కెమెరా, f/2.2 అపేచర్‌తో 5MP అల్ట్రా వైడ్ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.1 అపేచర్‌తో 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ప్రధాన కెమెరా అనేక పొర్ట్రెయిట్ ఫోకల్ లెంత్‌లను కలిగి ఉంటుంది. అవి.. 1x ఎన్విరాన్‌మెంటల్ పొర్ట్రెయిట్, 2x అట్మాస్‌పియరిక్ పొర్ట్రెయిట్, 3x క్లోజ్ అప్ పొర్ట్రెయిట్.. ఈ హానర్ 200 లైట్ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంటుంది. అయితే తక్కువ ధరలో మెరుగైన కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌ను హానర్ లాంచ్ చేసింది.
ఈ హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్ 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4500mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. మరియు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.1, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. స్టారీ బ్లూ, సియాన్ లేక్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

హానర్ 200 లైట్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.17,999 గా ఉంది. అమెజాన్ సహా ఇతర ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో సెప్టెంబర్ 26వ తేదీ 12AM గంటలకు సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో ఈ హ్యాండ్‌సెట్ సేల్ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను SBI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. అంటే ప్రారంభ ధర రూ.15999 గా ఉండనుంది.


Click it and Unblock the Notifications








