Home
Mobile

ఐరోపా,UK దేశాల్లో హానర్ 400 లైట్ విడుదల..6.7″ అమోలెడ్ డిస్‌ప్లే, 108MP కెమెరా, 5230mAh బ్యాటరీతో అదరగొడుతోంది!

HONOR 400 Lite 5G: హానర్ కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న HONOR 400 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను యూరప్ UK మార్కెట్లలో అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లను అందించడంలో పేరుగాంచిన ఈ ఫోన్, ఇటీవలి గ్లోబల్ లాంచ్ తర్వాత ఇప్పుడు మరిన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, AI కెమెరా సిస్టమ్, అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోందీ కొత్త ఫోన్.

* కళ్లు చెదిరే డిస్‌ప్లే, అదిరే డిజైన్.

HONOR 400 Lite 5G ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది, 93.7% స్క్రీన్-టు-బాడీ రేషియో ఉండటం వల్ల ఫోన్ ముందు భాగమంతా దాదాపు డిస్‌ప్లేనే ఉంటుంది. 3,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో, ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.

HONOR 400 Lite 5G Launches in Europe and UK

ఈ ఫోన్ కేవలం 7.29mm మందంతో, 171 గ్రాముల బరువుతో చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది. అంతేకాదు, ఎక్కువసేపు ఫోన్ వాడినా కళ్లకు ఇబ్బంది కలగకుండా 3840Hz PWM డిమ్మింగ్, లో బ్లూ లైట్ హార్డ్‌వేర్ ఫిల్టర్, సిర్కాడియన్ నైట్ మోడ్ వంటి అధునాతన కంటి సంరక్షణ టెక్నాలజీలు కూడా ఇందులో ఉన్నాయి.

* అధునాతన AI కెమెరా సిస్టమ్

ఫొటోగ్రఫీ విషయంలో HONOR 400 Lite నిజంగా అదరగొడుతుంది. ఇందులో శక్తివంతమైన 108MP మెయిన్ కెమెరా, అలాగే 5MP అల్ట్రా-వైడ్/డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ప్రత్యేకంగా, HONOR ఈ ఫోన్‌లో AI కెమెరా బటన్‌ను జోడించింది. ఈ బటన్‌ను ఒక్కసారి నొక్కితే చాలు, వెంటనే కెమెరా ఓపెన్ అవుతుంది.

దాంతో ఈజీగా ఫొటోలు తీయొచ్చు, వీడియోలు రికార్డ్ చేయొచ్చు, లేదా గూగుల్ లెన్స్ ఫీచర్లను కూడా వాడుకోవచ్చు. కెమెరా సిస్టమ్‌లో AI ఎరేజర్ (ఫొటోల్లో అనవసరమైన వాటిని తొలగించడానికి), AI ఔట్‌పెయింటింగ్ (ఫొటోలను విస్తరించడానికి) వంటి AI ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటితో ఫోన్‌లోనే ప్రొఫెషనల్-గ్రేడ్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు.

* పనితీరు, ఇతర ఫీచర్లు

ఈ ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7025-అల్ట్రా (MediaTek Dimensity 7025-Ultra) చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం IMG BXM-8-256 GPU ఉంది. ఇది 8GB/12GB RAM ఆప్షన్లలో, 256GB స్టోరేజ్‌తో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాజిక్ OS 9.0 (MagicOS 9.0) యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.

హానర్ ర్యామ్ టర్బో టెక్నాలజీ ద్వారా అదనంగా 8GB వరకు వర్చువల్ RAMను కూడా పొందవచ్చు. దీనివల్ల మొబైల్ స్లో అవ్వకుండా చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మంచి సౌండ్ కోసం స్టీరియో స్పీకర్లు, ఆడియో కోసం USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

* కనెక్టివిటీ, బ్యాటరీ

ఈ డివైజ్ 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi (2.4GHz, 5GHz), బ్లూటూత్ 5.3కు సపోర్ట్ చేస్తుంది. నావిగేషన్ కోసం GPS, గ్లోనాస్, గెలీలియో, బైడూ వంటి పలు సిస్టమ్స్ ఉన్నాయి. 5230mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది, కాబట్టి రోజంతా వాడుకోవచ్చు. త్వరగా ఛార్జ్ అవుతుంది.

* నిర్మాణ నాణ్యత, మన్నిక

రోజువారీ వాడకానికి అనువుగా ఉండేలా హానర్ 400 Lite ను తయారుచేశారు. దీనికి IP65 రేటింగ్ ఉంది, అంటే దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ ఉంటుంది. అంతేకాకుండా, నీటి నిరోధకత, కింద పడినా తట్టుకునే విషయంలో SGS ఫైవ్-స్టార్ ప్రమాణాలను కూడా అందుకుంది. కాబట్టి, రోజువారీ ఉపయోగంలో ఇది మరింత మన్నికగా ఉంటుంది.

* ధర, లభ్యత

హానర్ 400 Lite 5G (8GB + 256GB వేరియంట్) ధర యూరప్‌లో 299 యూరోలు (సుమారు 339 డాలర్లు / రూ.29,195), UKలో 249.99 పౌండ్లు (సుమారు $327 / రూ.28,165)గా ఉంది. ఇది ఇప్పటికే ఇటలీ, ఆస్ట్రియా వంటి దేశాల్లో అందుబాటులో ఉంది.

UK వినియోగదారులు ఏప్రిల్ 22 నుంచి honor.com/uk వెబ్‌సైట్‌లో, EE, O2, వోడాఫోన్, అమెజాన్, ఆర్గాస్, కర్రీస్, వెరీ వంటి ప్రధాన రిటైలర్ల వద్ద కొనుగోలు చేయవచ్చు. 2025 వసంతకాలంలో, ఇది రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లో, హార్వే నార్మన్ స్టోర్ల ద్వారా కూడా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

Best Mobiles in India

English summary
HONOR 400 Lite 5G Launches in Europe and UK: Price, Specs feat. 120Hz AMOLED, 108MP Camera, 5230mAh Battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X