200MP కెమెరా, 6000mAh బ్యాటరీతో హానర్ 400 సిరీస్ స్మార్ట్ఫోన్లు.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
Honor 400 Series : ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ హానర్ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్మార్ట్ఫోన్ సిరీస్ విడుదల అయింది. హానర్ 400 సిరీస్లో భాగంగా హానర్ 400, 400 ప్రో మోడల్స్ గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్ ఫోన్లు 200MP కెమెరాను కలిగి ఉన్నాయి. ప్రో మోడల్ IP68 + IP69 రేటింగ్తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్గా ఉంది. ఈ ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
డిస్ప్లే వివరాలు :
హానర్ 400 సిరీస్ స్మార్ట్ఫోన్లు డిస్ప్లే, చిప్సెట్, ఛార్జింగ్ సపోర్టు, కెమెరా విభాగాల్లో కొన్ని మార్పులను గమనించవచ్చు. డిస్ప్లేల పరంగా హానర్ 400 మోడల్ 120Hz రీఫ్రెష్ రేట్తో 6.55 అంగుళాల FHD+ OLED డిస్ప్లేను కలిగి ఉంది. అదే ప్రో మోడల్ 120Hz రీఫ్రెష్ రేట్తో 6.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది.

6 సంవత్సరాల వరకు అప్డేట్స్ :
హానర్ 400 హ్యాండ్సెట్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో పనిచేస్తుంది. అదే ప్రో మోడల్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0 పైన పనిచేస్తుంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు 6 సంవత్సరాల వరకు అప్డేట్స్ పొందుతాయని హానర్ వెల్లడించింది.
200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా బేస్ వేరియంట్ 200MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. అదే ప్రో మోడల్ 200MP + 50MP టెలిఫోటో, 12MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ రెండు మోడల్స్ 50MP కెమెరాను కలిగి ఉన్నాయి.
6000mAh బ్యాటరీ :
హానర్ 400 స్మార్ట్ఫోన్ 66W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 15 నిమిషాల్లోనే 44 శాతం ఛార్జింగ్ను పూర్తి చేస్తుంది. అదే ప్రో మోడల్ 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ ని కలిగి ఉంది.
ఈ హానర్ స్మార్ట్ఫోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత AI ఇమేజ్ టూ వీడియో, AI ఎడిటింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్తోపాటు భద్రత కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. హానర్ 400 బేస్ వేరియంట్ IP65 రేటింగ్తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్గా ఉంది. అదే ప్రో వేరియంట్ IP68 + IP69 రేటింగ్తో మెరుగైన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్గా ఉంది.
హానర్ 400 సిరీస్ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం యూరప్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డిజర్ట్ గోల్డ్, లూనార్ గ్రే, మిడ్నైట్ బ్లాక్ కలర్ వేరియంట్స్లో బేస్ మోడల్ లభిస్తుంది. అదే లూనార్ గ్రే, మిడ్నైట్ బ్లాక్ రంగుల్లో ప్రో వేరియంట్ లభిస్తుంది. భారత్ కరెన్సీ ప్రకారం సిరీస్ ప్రారంభ ధర సుమారు రూ.45 వేలుగా ఉంది. అయితే భారత్లో విడుదలపై ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు.


Click it and Unblock the Notifications








