రూ.10,999 రేంజ్‌లో పర్‌ఫెక్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్!

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ హువావే తన ఆన్‌లైన్ స్పెసిఫిక్ బ్రాండ్ Honor నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. హానర్ 5C పేరుతో విడుదలైన ఈ బడ్జెట్‌ ఫ్రెండ్లీ బ్లాక్‌బస్టర్ ఫోన్ రూ.10,999 రేంజ్‌లో బెస్ట్ మార్కులను సొంతం చేసుకుంది. మార్కెట్లో ఇటీవల విడుదలైన సంచలనాలు రేపుతోన్న షియోమీ Redmi Note 3 ఫోన్‌కు Honor 5C ప్రధాన కాంపిటీటర్‌గా నిలిచింది.

రూ.10,999 రేంజ్‌లో పర్‌ఫెక్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్!

హోరా హోరీగా తలపడుతోన్న ఈ రెండు ఫోన్‌ల మధ్య స్పెసిఫికేషన్‌లు నువ్వానేనా అన్నట్లు ఉన్నాయి. మెటల్ క్లాడ్ బాడీతో తీర్చిదిద్దబడిన హానర్ 5సీ ఫోన్ 16ఎన్ఎమ్ టెక్నాలజీతో రూపుదిద్దుకోబడిన శక్తివంతమైన Kirin 650 చిప్‌సెట్‌తో వస్తోంది. ఈ ప్రాసెసర్ ఫోన్ మల్టీ టాస్కింగ్‌తో పాటు బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేస్తుంది. ఈ రెండు ఫోన్‌లలో కెమెరా చాలా ముఖ్యమైన ఫీచర్. హానర్ అలానే షియోమీ పోన్‌లు హైక్వాలిటీ కెమెరాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ రెండు ఫోన్‌లలో నిక్షిప్తం చేసిన కెమెరా వ్యవస్థలకు సంబంధించి వ్యత్యాసాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మూత్ కెమెరా పనితీరు

ముందుగా ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి బేసిక్ కెమెరా స్సెసిపికేషన్‌లు పరిశీలించినట్లయితే.. హానర్ 5సీ ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. రేర్ ఫేసింగ్ కెమెరాలో ఎల్ఈడి ఫ్లాష్ లైట్, పీడీఏఎఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇదే సమయంలో రెడ్మీ నోట్3 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది.

సెల్ఫీ ప్రియులకు హానర్ 5సీ గొప్ప ట్రీట్

హానర్ 5సీ ఫోన్‌లో 8 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ప్రంట్ పేసింగ్ కెమెరాను మీరు చూడొచ్చు. ఇదే సమయంలో రెడ్మీ నోట్ 3,5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరాను మాత్రమే కలిగి ఉంది. సెల్ఫీ ప్రియులకు హానర్ 5సీ గొప్ప ట్రీట్

ఎడిటింగ్ టూల్స్ ఇంకా ఫీచర్స్

నైట్ మోడ్, గుడ్‌ఫుడ్, బ్యూటీ అండ్ లైట్ పెయింటింగ్ వంటి ప్రత్యేకమైన ఎడిటింగ్ టూల్స్‌ను హానర్ 5సీ కెమెరాలో చూడొచ్చు. అంతేకాకుండా కెమెరాలో పొందుపరిచిన pro mode ద్వారా ఐఎస్ఓ, షట్టర్ స్పీడ్, పోకస్, వైట్ బ్యాలన్స్, ఎక్స్‌పోజర్ వంటి ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు.

ప్రాసెసర్ పవర్

ఫోన్‌లోని ఫోటోలు వేగవంతంగా ప్రాసెస్ అవ్వాలంటే మంచి ప్రాసెసర్ అవసరమవుతుంది. ఇటువంటి హెవి టాస్కులను హానర్ 5సీ ఫోన్‌లో ఏర్పాటు చేసిన Kirin 650 ప్రాసెసింగ్ చిప్‌సెట్ స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది.

గుడ్ క్వాలిటీ విజువల్స్

హానర్ 5సీ ఫోన్‌లో ఏర్పాటు 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్ర్ర్కీన్ మీరు చిత్రీకరించిన ఫోటోలను హై క్వాలిటీతో డిస్‌ప్లే చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 5C vs Redmi Note 3: 5 Reasons why 5C is a delight for camera lovers!
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting