ఫీచర్లు ఒకటే.. ఆ ఫోన్‌ల మధ్య తేడా మాత్రం రూ.5,000

చైనా ఫోన్‌ల కంపెనీ Huawei రెండున్నర సంవత్సరాల క్రితం మార్కెట్‌కు పరిచయమైన ఆన్‌లైన్ స్పెసిఫిక్ బ్రాండ్ Honor ఆన్‌లైన్ షాపర్లకు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో నమ్మకమైన ఫోన్‌లను అందిస్తూ మార్కెట్ షేర్‌ను మరింత పెంచుకుంటూ వస్తోంది. తాజాగా హానర్ బ్రాండ్ నుంచి Honor 5C స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యింది. ధర రూ.10,999.

ఫీచర్లు ఒకటే.. ఆ ఫోన్‌ల మధ్య తేడా మాత్రం రూ.5,000

ప్రీమియమ్ శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడే విధంగా ఈ ఫోన్ స్పెక్స్ ఉండటం విశేషం. ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 స్మార్ట్‌ఫోన్‌‌ను హానర్ 5సీ దాదాపుగా అధిగమించగలిగింది. ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన spec comparisonను ఇప్పుడు చూద్దాం...

Read More : ఈ ఫోన్‌లు మీ బడ్జెట్‌కు పూర్తి న్యాయం చేస్తాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రీమియమ్ లుకింగ్ మెటల్ బాడీ డిజైన్

బాడీ డిజైనింగ్ వచ్చేసరికి, హానర్ 5సీ ఫోన్ ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యుమినియమ్ - అలాయ్ బాడీతో వస్తోంది. ఇదే సమయంలో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 మెటల్ అండ్ గ్లాస్ బాడీ డిజైన్‌తో వస్తోంది. హానర్ 5సీ ఫోన్ ధరతో పోలిస్తే గెలాక్సీ ఏ5 ధర చాలా ఎక్కువ. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ గెలాక్సీ ఏ5 ఫోన్‌ను రూ.16,490 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.

1080 పిక్సల్ డిస్‌ప్లే

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920 x 1080పిక్సల్స్, 424 పీపీఐ పిక్సల్ డెన్సిటీ. ఇదే సమయంలో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 కూడా హానర్ 5సీ తరహా డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌లనే కలిగి ఉంది. ధర విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్‌ల మధ్య రూ.వేలల్లో తేడా ఉంది.

16ఎన్ఎమ్ ఆర్కిటెక్షర్‌తో శక్తివంతమైన ఆక్టా-కోర్ హార్డ్‌వేర్

హానర్ 5సీలో పొందుపరిచిన Kirin 650 SoC ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ. ఆక్టా కోర్ సీపీయూ అలానే 16ఎన్ఎమ్ ప్రాసెసింగ్ పవర్‌తో వచ్చిన ఈ చిప్‌సెట్ ఫోన్ ప్రాసెసింగ్‌ సరళినే మార్చేస్తుంది. స్మూత్ ప్రాసెసింగ్‌‌ను యూజర్ ఆస్వాదించవచ్చు. ఈ సాక్‌కు అనుసంధానించిన Mali T830 GPU ఫోన్ గ్రాఫిక్స్ విభాగాన్ని మరింత సమర్థవంతం చేస్తుంది. మరోవైపు సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 సొంతంగా తయారు చేసుకున్న ఎక్సినోస్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తోంది.

కైరిన్ 650 చిప్‌సెట్ 40 శాతం తక్కువ బ్యాటరీ శక్తిని ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగాన్ని అందిస్తుంది. తద్వారా ఫోన్ బ్యాటరీ బ్యాకప్ మరింత ఆదా అవుతుందని
కంపెనీ చెబుతోంది.

ర్యామ్ విషయానికి వచ్చేసరికి

ర్యామ్ విషయానికి వచ్చేసరికి హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్, 2జీబి ర్యామ్‌తో పెయిర్ చేయబడిన 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి విస్తరించుకునే అవకాశం. సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 ఫోన్ కూడా 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌ వ్యవస్థలను కలిగి ఉంది.

 

కెమెరా విషయానికి వచ్చేసరికి

కెమెరా విషయానికి వచ్చేసరికి హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 8 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఫ్రంట్ క్యామ్ ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను యూజర్లు ఆస్వాదించవచ్చు. ఇదే సమయంలో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

 

ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్, శక్తివంతమైన ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఫోన్ డేటా మరింత సెక్యూర్‌గా ఉంటుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ లోపించింది.

ఆపరేటింగ్ సిస్టం...

హానర్ 5సీ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఈ ఓఎస్ ఆధారంగా అభివృద్ధి చేసిన హానర్ నేటివ్ యూజర్ ఇంటర్‌ఫేస్ EMUI 4.1 అదనపు ఫీచర్లతో పాటు సలువైన కస్టమైజేషన్‌తో ఆకట్టుకుంటుంది. ఇదే సమయంలో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 ఫోన్‌ పాత వర్షన్ Android v4.4 (KitKat) ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోంది.

బ్యాటరీ విషయానికొస్తే...

హానర్ 5సీ ఫోన్ శక్తివంతమైన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ పై రోజంతా ఫోన్‌ను వాడుకోచ్చు. Kirin 650 చిప్‌సెట్‌తో రన్ అవుతోన్న ఈ ఫోన్‌లో బ్యాటరీ పనితీరు బాగుంటుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 ఫోన్‌ 2,900 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది.

కనెక్టువిటీ ఫీచర్లు...

హానర్ 5సీ ఫోన్ డ్యుయల్ సిమ్ కనెక్టువిటీతో వస్తోంది. యూఎస్బీ టైప్-సీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, వంటి అత్యాధునిక స్టాండర్ట్ కనెక్టువిటీ ఫీచర్లు హానర్ 5సీ ఫోన్ లో ఉన్నాయి. సామ్ సంగ్ గెలాక్సీ ఏ5 ఫోన్ లో యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ లోపించింది.

హానర్ 5సీ చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది...

హానర్ 5సీ ఫోన్ డిజైన్ ఇంకా బరువు (156 గ్రాములు)ను బట్టి చేస్తే ఫోన్ చేతుల్లో కంఫర్ట్‌గా ఇమిడిపోవటంతో పాటు పాకెట్‌లో సౌకర్యవంతంగా ఇమిడి పోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 5C vs Samsung Galaxy A5: 10 Things You Need to Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot