రోజంతా వచ్చే బ్యాటరీతో ‘హానర్ 5సీ’

హువావే తన హానర్ సిరీస్ నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన 'Honor 5C' స్మార్ట్‌ఫోన్‌ ప్రామిసింగ్ స్పెక్స్‌తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లోని ప్రాసెసర్ అలానే బ్యాటరీ వ్యవస్థలు మెప్పించదగినవిగా ఉన్నాయి.

 రోజంతా వచ్చే బ్యాటరీతో ‘హానర్ 5సీ’

విప్లవాత్మక కైరిన్ 650 చిప్‌సెట్‌తో వస్తోన్న హానర్ 5సీ ఫోన్ స్మూత్ ప్రాసెసింగ్‌తో ఆకట్టుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఈ ప్రాసెసర్‌కు జోడీగా ఉన్న 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ డివైస్ పనితీరును రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుందనటానికి పలు ఆసక్తికర కారణాలను ఇప్పుడు చూద్దాం....

Read More : రెండు లక్షల ఫ్రీడం 251 ఫోన్‌లు రెడీ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కాంపాక్ట్ డిజైన్‌తో పాటు పెద్ద బ్యాటరీ...

హానర్ 5సీ ప్రత్యేకతలు

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్‌‌తో ఆకట్టుకుంటుంది. ఈ బ్యాటరీ నిర్మాణంలో భాగంగా 650Wh/L ఎనర్జీ డెన్సిటీతో పాటు, కాంపాక్ట్ డిజైనింగ్‌ను హావావే ఎంచుకుంది.

FinFET Plus 16ఎన్‌ఎమ్ చిప్‌సెట్ టెక్నాలజీ

హానర్ 5సీ ప్రత్యేకతలు

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించిన ఫ్లాగ్‌షిప్ FinFET Plus 16ఎన్‌ఎమ్ చిప్‌సెట్ టెక్నాలజీ, 28nm, 20nm ప్రాసెసింగ్ చిప్ సెట్‌లతో పోలిస్తే వేగవంతమైన ప్రాసెసింగ్‌ను అందించగలదు.

తక్కువ బ్యాటరీ ఖర్చు

హానర్ 5సీ ప్రత్యేకతలు..

కైరిన్ 650 చిప్‌సెట్ 40 శాతం తక్కువ బ్యాటరీ శక్తిని ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగాన్ని అందిస్తుంది. తద్వారా ఫోన్ బ్యాటరీ బ్యాకప్ మరింత ఆదా అవుతుంది.

హీటింగ్ సమస్య చాలా తక్కువగా...

హానర్ 5సీ ప్రత్యేకతలు..

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌లో హీటింగ్ సమస్య చాలా తక్కువగా ఉంటుంది. ఫోన్ నిదానించటం, లాగింగ్‌కు గురికావటం వంటి అవాంతరాలు దాదాపుగా ఉండవు. హెవీ యాప్స్‌ను సైతం ఈ చిప్‌సెట్‌ స్మూత్‌గా డీల్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

హానర్ 5సీ ప్రత్యేకతలు..

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఈ ఓఎస్‌లో అప్‌డేట్ చేయబడిన ఫీచర్స్ బ్యాటరీ బ్యాకప్‌ను మరింతగా మెరుగుపరుస్తాయి. ఈ ఫోన్‌తో హువావే అందిస్తోన్న EMUI 4.1 OS యాప్స్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుతూ బ్యాటరీ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.

డిస్‌ప్లే, ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్

హానర్ 5సీ ప్రత్యేకతలు..

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 424 పీపీఐ), ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌ కోర్ కైరిన్ 650 16ఎన్ఎమ్ ప్రాసెసర్, మాలీ టీ830 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ర్యామ్, స్టోరేజ్, కెమెరా

హానర్ 5సీ ప్రత్యేకతలు..

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : ప్రో మోడ్, సూపర్‌నైట్ మోడ్, గుడ్ ఫుడ్, బ్యూటీ అండ్ లైట్ పెయింటింగ్).

కనెక్టువిటీ ఫీచర్లు, బ్యాటరీ

హానర్ 5సీ ప్రత్యేకతలు..

ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్, 4జీబి ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 5C with powerful battery is an awesome partner for long journeys: Top 3 Reasons. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting