అంతరాయంలోని పనితీరు ఈ ఫోన్ సొంతం

చైనా టెక్ దిగ్గజం Huawei తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ హానర్ 6ఎక్స్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.12,999. హానర్ 5ఎక్స్ ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా లాంచ్ అయిన హానర్ 6ఎక్స్ కాంపిటీటివ్ స్పెసిఫికేషన్‌లతో ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 4, కూల్ 1 డ్యుయల్, మోటో జీ4 ప్లస్ వంటి ఫోన్‌లకు ప్రధాన పోటీదారుగా నిలిచింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హువావే సొంతంగా డిజైన్ చేసిన ఆక్టా కోర్ సీపీయూ

హానర్ 6ఎక్స్ ఫోన్‌లోని ప్రధాన హైలెట్‌లలో కైరిన్ 650 చిప్‌సెట్ ఒకటి. ఈ ఆక్టా కోర్ సీపీయూను హువావే సొంతంగా డిజైన్ చేసుకుంది. 3జీబి అలానే 4జీబి ర్యామ్ కాన్ఫిగరేషన్స్‌కు అవసరమైన ప్రాసెసింగ్ అవసరాలను ఈ సీపీయూ తీరుస్తుంది.

చిప్‌సెట్‌ పనితీరును పరిశీలించినట్లయితే..

కైరిన్ 655 ఆక్టా కోర్ చిప్‌సెట్‌లోని 8 కోర్‌లలో నాలుగు 'Performance' కార్టెక్స్ A53 కోర్‌లు 2.1GHz క్లాక్ వేగంతో, నాలుగు 'Companion' కార్టెక్స్ A53 కోర్‌లు 1.7GHz క్లాక్ వేగంతో స్పందిస్తాయి.

Performance సీపీయూ

ఫోన్‌లోని కాల్స్, కౌంటింగ్ స్టెప్స్, ఎంపీ3 ప్లేబ్యాక్, వాయిస్ రికార్డింగ్, స్పీచ్ రికగ్నిషన్ వంటి పనులను Companion సీపీయూ చక్కబెడుతుంది. గేమింగ్, హైడెఫినిషన్ వీడియో ప్లే బ్యాక్, ఫోన్ ఎడిటింగ్ వంటి పనులను Performance సీపీయూ చక్కబెడుతుంది.

 

అంతరాయంలేని మల్టీ టాస్కింగ్‌

3జీబి అలానే 4జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న హానర్ 6ఎక్స్ ఫోన్‌లలో అంతరాయంలేని మల్టీ టాస్కింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఆక్టా‌కోర్ కైరిన్ 650 చిప్‌సెట్ ఇకేసారి 20 యాప్స్‌‌ హ్యాండిల్ చేయగలదు. ఈ ఫోన్‌లో వీడియో స్ట్రీమింగ్, ఫోటో ఎడిటింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ వంటి పనులను సౌకర్యవంతంగా నిర్వహించుకోవచ్చు.

హై-గ్రాఫికల్ 3డీ గేమ్స్‌

Mali- T830 MP2 GPUతో వస్తోన్న ఈ ఫోన్‌లో కాంటాక్ట్ కిల్లర్ స్నైపర్, మార్వెట్ కాంటెస్ట్ ఆఫ్ ఛాంపియన్స్, Asphalt 8, డెత్ రేస్ వంటి హై-గ్రాఫికల్ 3డీ గేమ్స్‌ను సునాయాశంగా హ్యాండిల్ చేయవచ్చు. ఈ గేమ్స్ ఆడుతున్న సమయంలో ఫ్రేమ్స్ డ్రాప్ అవటం, ఫోన్ పనితీరు నెమ్మదించటం, బ్యాటరీ హీటెక్కటం వంటి సమస్యలు కనిపించవు.

హీటింగ్ సమస్యలు ఉండవు

ఇతర ఫోన్‌ల మాదిరిగా హానర్ 6ఎక్స్ ఫోన్‌లలో హీటింగ్ సమస్యలు ఉండవు. రోజువారి స్మార్ట్ కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంతో హానర్ 6ఎక్స్ ఫోన్‌లోని కైరిన్ 650 చిప్‌సెట్ పూర్తిస్ధాయిలో విజయవంతమైంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 6X delivers lag free performance with the help of Octa-Core Kirin 655 CPU. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot