రెడ్మీ నోట్4కు షాకిచ్చిన కొత్త ఫోన్

స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగంలో గత రెండు సంవత్సరాలుగా మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 2014లో లాంచ్ అయిన మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను ప్రస్తుత ఫోన్‌లతో కంపేర్ చేసి చూసినట్లయితే కెమెరా టెక్నాలజీలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకున్నాయో స్పష్టంగా అర్థమైపోతుంది.

రెడ్మీ నోట్4కు షాకిచ్చిన కొత్త ఫోన్

ఆధునిక స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీ అనేది కేవలం ఖరీదైన ఫోన్‌లకే పరిమితం కాలేదు. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ఆస్వాదించగలుగుతున్నాం. నేటి స్పెషల్ ఫీచర్ స్టోరీలో భాగంగా Honor 6X, Redmi Note 4 స్మార్ట్‌ఫోన్‌ల మధ్య కెమెరా పనితీరును విశ్లేషించటం జరిగింది. ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందుగా హానర్ 6ఎక్స్ కెమెరా గురించి..

హానర్ 6ఎక్స్ ఫోన్‌కు డ్యుయల్ కెమెరా మాడ్యుల్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా DSLR తరహాలో రియల్ టైమ్ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ఫేస్‌ డిటెక్షన్ ఆటో ఫోకస్, ప్రో కెమెరా, ప్రో వీడియో, స్లో మోషన్, HDR, టైమ్ ల్యాప్స్, బ్యాక్ గ్రౌండ్ బ్లర్ వంటి ప్రత్యేకతమైన ఫీచర్లు హానర్ 6ఎక్స్ కెమెరాలో ఉన్నాయి.

షియోమీ రెడ్మీ నోట్ 4 కెమెరా గురించి..

హానర్ 6ఎక్స్ మాదిరిగా రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ కెమెరా మాడ్యుల్ సెటప్ కనిపించదు. కేవలం సింగిల్ లెన్స్‌తో కూడిన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను రెడ్మీ నోట్ 4 ఫోన్‌లో మనం చూడొచ్చు. ఈ కెమెరాలో ఉపయోగించిన Samsung ISOCELL ఇమేజ్ సెన్సార్, రెడ్మీ నోట్ 3తో పోలిస్తే బెస్ట్ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది.

డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ vs మోనో - లెన్స్ కెమెరా సెటప్‌

హానర్ 6ఎక్స్ ఫోన్‌లో ఏర్పాటు చేసిన డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్, రెడ్మీ నోట్ 4 ఫోన్‌లో పొందుపరిచిన మోనో - లెన్స్ కెమెరా సెటప్‌తో పోలిస్తే బెటర్ క్వాలిటీ పనితీరును ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే..?

 

బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్

కొన్ని నెలల కిత్రం వరకు డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ అనేది కేవలం హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే కనిపించేది. ఈ ట్రెండ్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ హువావే కంపెనీ తన హానర్ 6ఎక్స్ ఫోన్ ద్వారా మొట్టమొదటి సారిగా ఓ బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లోకి ఈ డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. సాంప్రదాయ మోనో లెన్స్ కెమెరాలలో తలెత్తే లో-లైట్ ఫోటోగ్రఫీ, మీగర్ డిటైలింగ్ వంటి సమస్యలు డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్‌లో ఏమాత్రం కనిపించవు.

 

ప్రతిసారి హైక్వాలిటీ ఫోటోలను ప్రొడ్యూస్ చేస్తుంది..

హానర్ ఫోన్ 6ఎక్స్ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ ప్రతిసారి హైక్వాలిటీ ఫోటోలను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కెమెరా ద్వారా బ్లాక్‌లైట్, లో లైట్ లాంటి కాంప్లెక్స్ కండీషన్‌లలోనూ హైక్వాలిటీ ఫోటోలను క్యాప్చుర్ చేసుకోవచ్చు. కెమెరాలో ఎక్విప్ చేయబడిన హైబ్రీడ్ ఆటో ఫోకస్ టెక్నాలజీ షార్ట్ రేంజ్ ఫోటోల కోసం లేజర్ ఫోకస్, లాంగ్ రేంజ్ ఫోటోల కోసం డెప్త్ ఫోకస్‌లను ఉపయోగించుకుంటుంది.

తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ..

హానర్ 6ఎక్స్ ఫోన్‌లోని డ్యుయల్ కెమెరా సెటప్ తక్కువ వెళుతురు కండీషన్‌లలోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లోకి 12 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ లెన్స్ ఇమేజ్ క్వాలిటీని ఏ మాత్రం తగ్గించకుండా ప్రకాశవంతమైన ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి.

 

సబ్జెక్ట్ క్వాలిటీ ఏ మాత్రం దెబ్బతినదు

హానర్ 6ఎక్స్ ఫోన్ ద్వారా చిత్రీకరించే ఫోటోల్లో సబ్జెక్ట్ క్వాలిటీ కూడా ఏ మాత్రం దెబ్బతినదు. DSLR తరహా ఇమేజ్ క్వాలిటీని ఈ కెమెరా ఆఫర్ చేయగలదు. హానర్ 6ఎక్స్ ఫోన్‌లో ఫోకసింగ్ స్పీడ్ కూడా వేగంగా ఉంటుంది. ఈ ఫోన్‌లోని అల్ట్రా-ఫాస్ట్ ఫోకస్ వ్యవస్థ ద్వారా కేవలం 0.3 సెకన్ల వ్యవధిలో ఫోటోను క్యాప్చుర్ చేసుకోవచ్చు.

సహజత్వానికి మరింత దగ్గరగా..

పగటి వెళుతురులో రెడ్మీ నోట్ 4 ఫోన్ కెమెరా నుంచి చిత్రీకరించిన ఫోటోలు రిచ్‌గా కనిపిస్తున్నప్పటికి వాటిలో సహజత్వం అనేది లోపించి ఆర్టిఫీషియల్ ఫీలింగ్ ఎక్కువుగా కలిగిస్తుంది. ఇదే సమయంలో హానర్ 6ఎక్స్ ఫోన్‌ నుంచి పగటి వెళుతరులో చిత్రీకరించిన ఫోటోలు నేచురల్ కలర్ టోన్స్‌తో సహజత్వానికి మరింత దగ్గరగా కనిపిస్తాయి.

డిటైలింగ్ ఇంకా షార్ప్‌నెస్..

డిటైలింగ్ ఇంకా షార్ప్‌నెస్ విషయానికి వచ్చేసరికి హానర్ 6ఎక్స్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఫోటోల్లో ఇమేజ్ క్వాలిటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో నాయిస్ లెవల్స్ కూడా తక్కువుగా ఉంటాయి. వెళుతురు తక్కువుగా ఉన్న వాతావరణంతో ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన కెమెరాను పరిశీలించి చూసినట్లయితే హానర్ 6ఎక్స్ కెమెరా నాణ్యమైన ఫోటోలను ఆఫర్ చేస్తోంది.

Bokeh Effects విషయంలోనూ..

Bokeh Effects విషయంలోనూ రెడ్మీ నోట్ 4తో పోలిస్తే హానర్ 6ఎక్స్ విజేతగా నిలిచింది. హానర్ 6ఎక్స్ ఫోన్‌లోని డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ వైడ్ అపెర్చుర్ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఫోటో బ్యాక్‌‌గ్రౌండ్‌లను కావల్సిన విధంగా బ్లర్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్టివ్ కెమెరా మోడ్, మీరు చిత్రీకరించే ఫోటోల పై పూర్తి నియంత్రణను అందిస్తుంది.

 

రెడ్మీ నోట్ 4 ఫోన్‌లో..

రెడ్మీ నోట్ 4 ఫోన్‌లో ఫోటో బ్యాక్‌‌గ్రౌండ్‌లను బ్లర్ చేసుకునేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను షియోమీ ఇన్‌బిల్ట్‌గా ఇస్తున్నప్పటికి హార్డ్‌వేర్ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 6X Vs Xiaomi Redmi Note 4: Best photography camera phone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot