హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

|

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ హువావీ (Huawei ) తన హానర్ సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. హానర్ 7 పేరుతో రాబోతోన్న ఈ ఫోన్ ఇప్పటికే చైనా ఇంకా యూరోపియన్ దేశాల్లో లభ్యమవుతోంది. మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి శక్తివంతమైన స్పెక్స్‌ను ఈ ఫోన్‌లో పొందుపరిచారు.

 

మార్కెట్లో లభ్యమవుతున్న అనేక ప్రముఖ కంపెనీల ఫోన్‌లకు హానర్ 7 నెక్ టు నెక్ పోటీనిచ్చే అవకాశముంది. హానర్ 7 స్మార్ట్‌ఫోన్ ప్రాముఖ్యతను మీకు తెలియజేసే క్రమంలో ఎల్‌జీ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ‘జీ3'తో కంపేర్ చేస్తూ ఓ సూపర్ ఛాలెంజ్ స్టోరీని పోస్ట్ చేయటం జరుగుతోంది...

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైన్

మెటాలిక్ ఫినిష్‌తో వస్తోన్న హానర్ 7 ఆప్టికల్ ఫారమ్-ఫాక్టర్‌ను కలిగి ప్రీమియల్ ఫీల్‌ను కలిగిస్తుంది. అల్యూమినియమ్ మెటల్‌తో బిల్ట్ చేయబడిన ఫోన్ యునిబాడీ డిజైన్ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఎల్‌జీ జీ3 బాడీ నిర్మాణం విషయానికొస్తే మెటల్‌, ప్లాస్టిక్ కలయకను మనం చూడొచ్చు. 

 

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

హానర్ 7, 5.7 అంగుళాల ఐపీఎస్ నియో ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్థ్యం 1920x 1080పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 423 పీపీఐ. హానర్ 7 డిస్‌ప్లే చాలా షార్ప్‌గా ఉంటుంది. సూర్యకాంతిలోనూ చదివేంత క్లియర్‌గా ఉంటుంది.

మరోవైపు ఎల్‌జీ జీ3, 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్థ్యం 1440x2560పిక్సల్స్, 538 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, ఈ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది.

 

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్
 

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

ఫోన్ లోపలి స్పెక్స్

హానర్ 7 ఫోన్‌లో 3జీబి ర్యామ్‌తో కూడిన కైరిన్ 930 ఆక్టా కోర్ చిప్‌సెట్‌ను పొందుపరిచారు. మాలీ టీ628 జీపీయూ అత్యుత్తమ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తుంది.

మరోవైపు ఎల్‌జీ జీ3, క్వాల్కమ్ ఎంఎస్ఎమ్8974ఏసీ స్నాప్‌డ్రాగన్ క్వాడ్ కోర్ 801 చిప్‌సెట్‌తో పాటు క్రెయిట్ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌తో వస్తోంది.

 

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన EMUI 3.1 స్కిన్ పై హానర్ 7 ఫోన్ రన్ అవుతుంది. మరోవైపు ఎల్‌జీ జీ3 ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోంది. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్‌కు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాన్ని ఎల్‌జీ కల్పిస్తోంది.

 

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

కెమెరా

హానర్ 7, శక్తివంతమైన 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. సోన్ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, 6 లెన్స్ మాడ్యుల్, ఎఫ్ 2.0 అపెర్చర్, సఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఆకట్టుకుంటుంది.

మరో వైపు, ఎల్‌జీ జీ3 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఫేస్ డిటెక్షన్, లేజర్ ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, డ్యయల్ ఎల్ఈడి ఫ్లాష్, టచ్ ఫోకస్, ఫేస్ ఇంకా స్మైల్ డిటెక్షన్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ కెమెరాలో పొందుపరిచారు. 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆకట్టుకుంటుంది.

 

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

స్టోరేజ్

హానర్ 7, 16జీబి ఇంకా 64జీబి స్టోరేజ్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. అంతేకాదు, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఆప్షన్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

మరోవైపు ఎల్‌జీ జీ3, 16 ఇంకా 32జీబి స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఆప్షన్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

ఫింగర్‌ప్రింట్ స్కానర్

హానర్ 7 స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది. ఎల్‌జీ జీ3 ఫోన్‌లో ఈ ఫీచర్ లోపించింది.

 

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

బ్యాటరీ

హానర్ 7 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. 3జీ నెట్‌వర్క్ పై 8 గంటల టాక్ టైమ్ ను ఈ బ్యాటరీ పై పొందవచ్చని కంపెనీ చేబుతోంది. మరోవైపు ఎల్‌జీ జీ3, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

ధర

ఇండియన్ మార్కెట్లో హానర్ 7 స్మార్ట్ ఫోన్ ధర రూ.22,999గా ఉంది. మరోవైపు ఎల్‌జీ జీ3 ధర రూ.30,499 ఉంది.

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

తీర్పు

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు తమ తమ స్థాయిలను బట్టి బలాబలాలను కలిగి ఉన్నాయి. అయతే ధర పరంగా చూస్తే విజయం మాత్రం హానర్7నే వరించింది. మెటల్ బాడీ డిజైనింగ్‌తో పాటు ఇతర స్పెక్స్ విషయాల్లోనూ హానర్ 7దే గెలుపు!

Best Mobiles in India

English summary
Honor 7 vs LG G3: 10 Major Differences!. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X