రూ.10 వేల కేటగిరిలో బెస్ట్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్

|

చైనాకు చెందిన హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ 7ఎ' ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో 3 జిబి రామ్‌, 32 జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న 7ఎ, 7సి వేరియెంట్ల ధర 8999, 9999 రూపాయలు బ్లాక్ గోల్డ్, బ్లూ రంగుల్లో ఈ వేరియంట్ లభ్యమవుతోంది. 2022 నాటికి దేశంలో టాప్‌ 3 బ్రాండ్లలో ఒకటిగా నిలవాలన్నది తమ లక్ష్యమని కంపెనీ కన్స్యూమర్‌ బిజినెస్‌ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.సంజీవ్‌ తెలిపారు. కాగా ఫీచర్ల విషయానికొస్తే రూ. 10 వేల బడ్జెట్లో ఈ ఫోన్ ఇతర ఫోన్లకు సవాల్ విసరనుంది.

 

గూగుల్ ఉచిత శిక్షణ గురించి తెలుసా, వారికి అధ్భుత అవకాశంగూగుల్ ఉచిత శిక్షణ గురించి తెలుసా, వారికి అధ్భుత అవకాశం

 హానర్ 7ఎ ఫీచర్లు

హానర్ 7ఎ ఫీచర్లు

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

బడ్జెట్ రేంజులో అదిరిపోయే కెమెరా

బడ్జెట్ రేంజులో అదిరిపోయే కెమెరా

హానర్ 7ఎ ఫోన్ 13MP+2MP డ్యూయెల్ లెన్స్ కెమెరాతో మార్కెట్లోకి వచ్చింది. బడ్జెట్ ధరలో ఇలాంటి ఫీచర్లు ఉన్న ఫోన్ ఇదే కావడం గమనార్హం. ఫీల్డ్ ఎఫెక్ట్ తో సాధారణంగా కనిపించేలా ఫోటోలను షూట్ చేసుకోవచ్చు. కాగా 2 ఎంపీ కెమెరాకు బొకె ఎపెక్ట్ సదుపాయం కూడా ఉంది. కాగా రెడ్‌మి నోట్ 5 ఇలాంటి డ్యూయెల్ కెమెరాను ఆఫర్ చేయడం లేదు. రెడ్‌మి నోట్ 5లో ఫీల్డ్ ఎపెక్ట్ సదుపాయం కూడా లేదు.

 లోవెలుతురులో కూడా అద్భుత సెల్ఫీలు
 

లోవెలుతురులో కూడా అద్భుత సెల్ఫీలు

రూ. 10 వేల బడ్జెట్లో మీరు అదిరిపోయే సెల్ఫీలు దిగాలనుకునే ఫోన్ కోసం సెర్చ్ చేస్తే ముందు వరుసలో ఈ ఫోన్ నిలుస్తుంది. 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో మీరు స్టన్నింగ్ సెల్ఫీ షూట్లను తీసుకోవచ్చు. F/2.2 wide apertureతో డే లైట్లో కూడా వివిడ్ సెల్ఫీలు దిగవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరాకు LED light సదుపాయాన్ని కూడా కల్పించారు.దీని ద్వారా మీరు అత్యంత తక్కువ వెలుతురులో కూడా ఫోటోలు అందంగా దిగవచ్చు.

 కెమెరా యాప్

కెమెరా యాప్

కెమెరా యాప్ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎఫెక్ట్ కోసం వెతుక్కోకుండానే అన్ని ఓ చోటనే పొందుపరిచారు. Moving pictures and Beauty modeలను కుడి భాగంలో ప్రవేశపెట్టారు. ఇలాంటి ఫీచర్ వల్ల మీరు స్వైప్ చేసే భారం తగ్గుతుంది. లెఫ్ట్ భాగంలో మీకు కెమెరా సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తాయి. image resolution, GPS, timer, touch to capture లాంటి ఫీచర్లు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి.

ఫిల్టర్స్

ఫిల్టర్స్

ఈ ఫోన్ కెమెరా విభాగంలో మీకు Photo, Pro Photo (manual mode), Video, Pro video, HDR, Night shot, Panorama, Light painting, Time-lapse, Filters, watermark లాంటి వాటిని ఆఫర్ చేస్తోంది. వీటితో పాటు కలర్ ఫిల్టర్స్ కూడా అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.

 ఫోటోలను మరింత అందంగా తీర్చిదిద్దే స్మార్ట్ ఫోన్

ఫోటోలను మరింత అందంగా తీర్చిదిద్దే స్మార్ట్ ఫోన్

డ్యూయెల్ లెన్స్ కెమెరా హార్డ్ వేర్ తో పాటు కొన్ని కొత్త ఫీచర్లతో ఈ ఫోన్ యూజర్లను ఆకర్షిస్తోంది. FullView displayతో 16 రంగులతో పాటు 75.4% బాడీ రేషియో స్క్రీన్ ఈ ఫోన్ సొంతం. ఫాస్ట్ పింగర్ ప్రింట్ సెన్సార్, బెస్ట్ క్లాస్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ తో పాటు పవర్ పుల్ 3,000 mAh batteryని కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. 3 GB RAM, and 32 GB ROMతో పాటు 256 GB ఇంటర్నల్ మెమొరీని పొందుపరిచారు.

Best Mobiles in India

English summary
Honor 7A: Best Dual-lens smartphone available at an unbelievable price More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X