బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు,రెడ్‌మి ఫోన్లకు సవాల్

దేశీయ మార్కెట్లో ఇప్పుడు బడ్జెట్ రేంజ్ వార్ నడుస్తోంది. అత్యంత తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లతో మొబైల్స్ ను దిగ్గజ కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి.

|

దేశీయ మార్కెట్లో ఇప్పుడు బడ్జెట్ రేంజ్ వార్ నడుస్తోంది. అత్యంత తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లతో మొబైల్స్ ను దిగ్గజ కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే టాప్ కంపెనీలు షియోమి, హువాయి, ఒప్పో, శాంసంగ్, ఆపిల్ లాంటి కంపెనీలు సైతం బడ్జెట్ సెగ్మెంట్ వైపు అడుగులు వేస్తున్నాయి. కాగా ఇప్పుడు షియోమి, హువాయి కంపెనీలే బడ్జెట్ సెగ్మెంట్లో తలపడుతున్నాయి. రెడ్ మి ఫోన్లకు ధీటుగా హువాయి తన హానర్ 7 సీరిస్ లో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి దించింది. మరి హానర్ 7సి ఫీచర్లేంటో ఓ సారి చూద్దాం.

 

జియో సంచలనాలు ఇప్పట్లో ఆగేలా లేవు, మళ్లీ టార్గెట్ !జియో సంచలనాలు ఇప్పట్లో ఆగేలా లేవు, మళ్లీ టార్గెట్ !

హానర్ 7సి ఫీచర్లు

హానర్ 7సి ఫీచర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధరలు

ధరలు

3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.9,999, రూ.11,999 ధరలకు వినియోగదారులకు లభించనుంది.
3GB RAM +32GB ROM ధర రూ.9,999
4GB RAM+ 64GB ROM ధర రూ. 11,999

5.99-inch FullView display
 

5.99-inch FullView display

ఇందులో 5.99 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫుల్‌వ్యూ ఫీచర్‌ను ఈ డిస్‌ప్లే కలిగి ఉంది. ఫిక్సల్ రిజల్యూషన్ 1440 x 720గా ఉంది. యూజర్లకు మంచి వ్యూయింగ్ అనుభూతిని కలిగించేదుకు ఈ భారీ డిస్‌ప్లే తోడ్పడనుంది.

Triple card slot for an uncompromising experience

Triple card slot for an uncompromising experience

ఇప్పుడు హైఎండ్ స్మార్ట్ ఫోన్లు అయినా, బడ్జెజ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు అయినా స్టోరేజ్ మీదనే ప్రధాన దృష్టిని పెడుతున్నాయి. దీని దృష్టిలో ఉంచుకుని హానర్ తన Honor 7Cలో మూడు స్లాట్లను పొందుపరిచింది. రెండు స్లాట్లలో సిమ్ అలాగే మరో స్లాట్ లో 256GB స్టోరేజ్ పెంచుకునే విధంగా రూపొందించారు.

Dual rear cameras for portrait shots

Dual rear cameras for portrait shots

వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలను ఇచ్చారు. కాగా ఈ కెమెరాలు ఎల్ ఈడి ఫ్లాష్ లైటుతో వచ్చాయి. దీని ద్వారా ఫోటో తీసుకున్నప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. షూట్ చేసే సమయంలో ఫోటో మీకు మరింత క్వాలిటీగా కనిపించేలా డార్క్ ని తరిమివేస్తుంది.

Selfie toning light and Face Unlock

Selfie toning light and Face Unlock

కాగా 8ఎంపీ సెల్ఫీ షూటర్ ఈ ఫోన్ కి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. ఈ లైట్ ద్వారా మీరు అత్యంత తక్కువ వెలుతురులో కూడా నాణ్యమైన ఫోటోలు తీసుకోవచ్చు. మీరు సెల్ఫీ క్లిక్ చేసే సమయంలో లైటింగ్, బ్రైట్ నెస్ అడ్జెస్ట్ మెంట్లు చేసుకోవచ్చు.
అయితే ఫేస్ అన్ లాక్ ఫీచర్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఇది ఫోన్ అన్ లాక్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని గమనించిన కంపెనీ అతి త్వరలోనే Honor 7Cకి OTA update ద్వారా ఈ ఫీచర్ అందివ్వనుంది.

గేమింగ్ ఎక్స్‌పీరియన్స్

గేమింగ్ ఎక్స్‌పీరియన్స్

Honor 7C 3000mAh battery పవర్ పుల్ బ్యాటరీతో వచ్చింది. ఈ బ్యాటరీ SmartPower 5.0 technologyతో వచ్చింది. ఇది మల్టిపుల్ పవర్ సేవింగ్ మోడ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా మీరు మరింత గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ని పొందవచ్చు.
ఇంకో ఆసక్తికర ఫీచర్ ఏంటంటే audio monitoring feature. దీని ద్వారా మీరు మీ వాయిస్ రికార్డుని చేసుకోవచ్చు. ఈ రికార్డు వాయిస్ మీరు ఇయ్ ర్ ఫోన్స్ పెట్టి వినడం ద్వారా స్టూడియోలో విన్న అనుభూతిని పొందే అవకాశం ఉంది.

డ్యూయెల్ బ్లూటూత్

డ్యూయెల్ బ్లూటూత్

ఇందులో మరొక ఆసక్తికర ఫీచర్ డ్యూయెల్ బ్లూటూత్. మీరు బ్లూటూత్ ద్వారా పెయిర్ జరుగుతున్నప్పుడు ఆ మ్యూజిక్ వినడం అలాగే కాల్స్ మాట్లాడుకోవడం లాంటి పనులు చేయవచ్చు.అయితే కొన్ని ఫోన్లలో కాల్ మాట్లాడుతున్నప్పుడు బ్లూటూత్ డిస్ కనెక్ట్ అవతాయి. ఈ ఫోన్లో అటువంటి సమస్య లేదు.

Best Mobiles in India

English summary
Honor 7C: Flagship class features and performance at a starting price of Rs. 9,999 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X