Honor 7C పై రూ.500 తగ్గింపు, అమెజాన్‌లో మాత్రమే!
హానర్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన హానర్ 7సీ (Honor 7C) రూ.500 ధర తగ్గింపును అందుకుంది.
హానర్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన హానర్ 7సీ (Honor 7C) రూ.500 ధర తగ్గింపును అందుకుంది. తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వేరియంట్‌ను రూ.9,499కే సొంతం చేసుకోవచ్చు. గతంలో ఈ ధర రూ.9,999గా ఉంది.

అఫర్ అమెజాన్‌లో మాత్రమే..
ఈ ఫోన్‌కు సంబంధించి మరొక మోడల్ అయిన 4జీబి ర్యామ్+ 64జీబి స్టోరేజ్ వేరియంట్‌ను రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. గతంలో ఈ ధర రూ.11,999గా ఉంది. హానర్ 7సీ స్మార్ట్‌ఫోన్‌లను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఈ ధర తగ్గింపు ఆఫర్ ఎన్ని రోజుల పాటు అందుబాటులో ఉంటుదనేది పై స్పష్టమైన సమాచారం లేదు.

రూ.2,200 ఇన్‌స్టెంట్ క్యాష్‌బ్యాక్‌తో పాటు 100జీబి అడిషనల్ 4జీ డేటా...
హానర్ 7సీ పై రూ.500 ధర తగ్గింపుతో పాటు మరిన్ని ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు నో కాస్ట్ ఈఎమ్ఐ ద్వారా ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఈ ఫోన్‌లను కొనుగోలు చేసే జియో యూజర్లకు రూ.2,200 ఇన్‌స్టెంట్ క్యాష్‌బ్యాక్‌తో పాటు 100జీబి అడిషనల్ 4జీ డేటా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఈ ఫోన్‌ను ఆర్డర్ చేసిన తరువాత రోజే సొంతం చేసుకోవచ్చు. ఈ వెసలుబాటు పిన్ కోడ్‌ను బట్టి అందుబాటులో ఉంటుంది.

హానర్ 7సీ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...
5.99 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ (720x1440పిక్సల్స్) ఐపీఎస్ ప్యానల్ విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం EMUI 8.0 ఇంటర్ ఫేస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఆక్టా కోర్ 450 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

కెమెరా విషయానికి వచ్చేసరికి..
13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ హెడ్ ఫోన్ జాక్, 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, హువాయి హిస్టిన్ 3డీ సౌండ్ ఎఫెక్ట్స్, రైడ్ మోడ్. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి ముఖ్యమైన సెన్సార్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications