Home
Mobile

1 మిలియన్‌కు పైగా రిజిస్ట్రేషన్లతో Honor 7X సంచలనం

హువాయి సబ్‌బ్రాండ్ హానర్ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన హానర్ 7ఎక్స్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిగతా ఫోన్లకు సవాల్ విసురుతూ దూసుకెళుతోంది.

By Hazarath

హువాయి సబ్‌బ్రాండ్ హానర్ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన హానర్ 7ఎక్స్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిగతా ఫోన్లకు సవాల్ విసురుతూ దూసుకెళుతోంది. మార్కెట్లో దీని ధర రూ.12,999గా ఉంది. ఎడ్జ్ టూ ఎడ్జ్ 18:9 aspect ratio డిస్‌ప్లేతో దూసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ యూనిబాడీ మెటల్ డిజైన్‌తో వచ్చింది. డ్యూయెల్ లెన్స్ కెమెరా సెటప్‌తో పాటు హువాయి Kirin 659 chipsetతో వచ్చిన ఈ ఫోన్ అమెజాన్ ఫ్లాష్ సేల్‌లో ఏకంగా 1 మిలియన్ కు పైగా రిజిస్ట్రేషన్లను కొల్లగొట్టింది. ఈ ఫోన్ బ్యాటరీ ఫర్‌ఫార్మెన్స్‌కి సంబంధించి ఇప్పటికే వివరాలను మీకందించడం జరిగింది. ఇప్పుడు కంపెనీ custom skin- EMUI 5.1 ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

 Deeper level of customization

Deeper level of customization

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీని ద్వారా మీరు మీ హోమ్ స్క్రీన్ నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. అలాగే ధీమ్స్ కాని ఐ కాన్స్ కాని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ సరికొత్త అనుభూతిని పొందే అవకాశం Honor 7Xలో ఉంది. ముఖ్యమైన వాటిని ఎప్పటికప్పుడూ మారుస్తూ ప్రతిరోజు ఓ కొత్తలుక్ ని ఈ ఫోన్లో చూడవచ్చు.

Smart Fingerprint Scanner

Smart Fingerprint Scanner

ఈ ఫోన్ smarter biometric sensorని ఆఫర్ చేస్తోంది. ఇది కేవలం అన్ లాక్ కొరకు మాత్రమే కాకుంగా ముఖ్యమైన వాటిని కూడా ఈ స్కానర్ ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చు. ఫిక్చర్స్ , వీడియో రికార్డింగ్, ఇన్‌కమింగ్ కాల్‌కి సమాధానం, అలారం స్టాప్ చేయడం, గ్యాలరీని వెతకడం లాంటి పనులకు కూడా ఈ స్కానర్ ఉపయోగపడుతుంది.

Smart battery usage features

Smart battery usage features

ముఖ్యంగా ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ లో యూజర్లకి ఓ సరికొత్త అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. యాప్స్ కి బ్యాటరీకి అవినాభావ సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఒక యాప్ రన్ అవుతున్నప్పుడు అది మాత్రమే బ్యాటరీని తినకుండా మిగతా యాప్స్ కూడా బ్యాటరీని తినేస్తూ ఉంటాయి. ఈ యాప్స్ వాడకపోయినా బ్యాటరీని తినేస్తాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను దాటేందుకు ఈ ఫోన్లో Ultra Power Saving mode అనే ఫీచర్ ఇచ్చారు.ఈ ఫీచర్‌తో మీరు వాడుతున్న యాప్ మాత్రమే బ్యాటరీ ని వాడుకుంటుంది. మిగతా యాప్స్ బ్యాటరీని తినకుండా ఈ ఫీచర్ కాపాడుతుంది.

Ease of use

Ease of use

ఈ ఫోన్లో ఉన్న మరొక ఫీచర్ ఏంటంటే ఒక యాప్ ద్వారా రెండు మల్టిపుల్ అకౌంట్లని ఓపెన్ చేసుకోవచ్చు. బ్రౌజింగ్ ఇంటర్నెట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. బ్యాటరీ పర్సంటేజ్ కూడా మీకు ఎప్పటికప్పుడు డిస్ ప్లే అవుతూ ఉంటుంది.

End-to-End connectivity solutions

End-to-End connectivity solutions

హానర్ 7ఎక్స్ Wi-Fi Bridge featureని ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా మీరు ఒకేసారి నాలుగు డివైస్ లకు కనెక్ట్ కావచ్చు. మీ ఇంపార్టెంట్ డేటాను హువాయి క్లౌడ్ స్టోరేజ్ లో భద్రపరుచుకునే అవకాశం కూడా ఉంది.

Carefully crafted pre-loaded apps

Carefully crafted pre-loaded apps

Weather, Calculator, Sound reorder, FM radio, Mirror, Hi care, Honor community, an Email client, Health app ఇలాంటి ఎన్నో ఫ్రీ లోడెట్ యాప్స్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఈ ఫోన్ ఓ కొత్త ఒరవడికి నాంది పలికే అవకాశం ఉందని కంపెనీ ధీమాను వ్యక్తం చేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor 7X runs one the most feature rich custom skin- EMUI 5.1 More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X