హానర్ 7ఎక్స్ VS మోటో జీ5ఎస్ ప్లస్, ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్?

Posted By: BOMMU SIVANJANEYULU

హానర్ బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎక్స్ అత్యాధునిక ఫీచర్లతో, ఇదే బడ్జెట్‌లోని ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు ప్రధాన పోటీదారుగా నిలించింది. ముఖ్యంగా మోటో జీ5ఎస్ ప్లస్‌కు హానర్ 7ఎక్స్ నుంచి నెక్ టు నెట్ కాంపిటీషన్ ఎదురవుతోంది. ఈ రెండు ఫోన్‌ల మధ్య స్పెసిఫికేషన్‌లను కంపేర్ చేసినట్లయితే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‌డిజైన్ అండ్ డిస్‌ప్లే

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మెటల్ యునిబాడీ డిజైన్‌లతో వస్తున్నాయి. దీంతో ప్రీమియమ్ లుక్‌లో ఇవి కనిపిస్తాయి. ఎడ్జ్-టు-ఎడ్జ్ స్ర్కీన్ కారణంగా హానర్ 7ఎక్స్, మోటో జీ5ఎస్ ప్లస్‌తో పోలిస్తే మరింత స్మార్ట్‌లుక్‌లో కనిపిస్తుంది. 18:9 యాస్పెక్ట్ రేషియో వల్ల హానర్ 7ఎక్స్ మోటో జీ5ఎస్ ప్లస్‌తో పోలిస్తే బెటర్ పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. వీడియో ప్లేబ్యాక్, వెబ్ బ్రౌజింగ్, గేమ్ ప్లే వంటి అంశాలు హానర్ 7ఎక్స్‌లో మరింత అర్థవంతంగా ఉంటాయి.

సాంప్రదాయ 16:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తోన్న మోటో జీ5ఎస్ ప్లస్ అవుట్ డేటెడ్ ఫీల్‌ను కలిగిస్తుంది. బెటర్ స్ర్కీన్-టు-బాడీ రేషియో కారణంగా హానర్ 7ఎక్స్ మరింత స్లిమ్‌గా కనిపిస్తుంది. ఇదే సమయంలో మోటో జీ5ఎస్ ప్లస్ బల్కీగా అనిపిస్తుంది.

మల్టీ టాస్కింగ్ విషయానికొస్తే..

ఈ రెండు ఫోన్‌లు సమానమైన ర్యామ్‌లను కలిగి ఉన్నప్పటికి పనితీరుపరంగా హానర్ 7ఎక్స్ ముందంజలో నిలిచింది. హానర్ 7ఎక్స్ డివైస్‌లోని ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే మల్టీ టాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళుతుంది. 18:9 యాస్పెక్ట్ రేషియో కారణంగా రెండు అప్లికేషన్‌లను ఒకేసారి హానర్ 7ఎక్స్ స్ర్కీన్ పై ఓపెన్ చేసుకునే వీలుంటుంది. మోటో జీ5ఎస్ ప్లస్‌లో ఇది సాధ్యం కాదు. ఆండ్రాయిడ్ నౌగట్ స్ప్లిట్ స్కీన్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటంలో హానర్ 7ఎక్స్ పూర్తిస్థాయిలో విఫలమైంది.

బ్యాటరీ ఇంకా మెమెురీ

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి బ్యాటరీ ఇంకా మెమురీ అంశాలను పరిశీలించినట్లయితే హానర్ 7ఎక్స్‌తో పోలిస్తే జీ5ఎస్ ప్లస్ వెనుకంజలో ఉంది. హానర్ 7ఎక్స్ 3,340mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తుండగా, మోటో జీ5ఎస్ ప్లస్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్‌తో మాత్రమే వస్తోంది. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ రెండ డివైస్‌లు 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా హానర్ 7ఎక్స్ స్టోరేజ్‌ను 256జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. ఇదే సమయంలో జీ5ఎస్ ప్లస్ స్టోరేజ్‌ను కేవలం 128జీబి వరకు మాత్రమే విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

అంగారహ గ్రహం మీద వింత వస్తువు, అసలేంటిది..?

డ్యుయల్ కెమెరా లెన్స్

ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్‌లతో వస్తున్నాయి. హానర్ 7ఎక్స్ 16ఎంపీ+2 ఎంపీ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుండగా, మోటో జీ5ఎస్ ప్లస్ 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. హానర్ 7ఎక్స్ ఫోన్‌లో bokeh షాట్స్ వేగంగా క్యాప్చుర్ అవుతున్నాయి. ఇదే సమయంలో మోటో జీ5ఎస్ ప్లస్ ఈ ప్రాసెస్‌ను చాలా నెమ్మదిగా చేస్తోంది.

ధరల వివరాలు

మార్కెట్లో హానర్ 7ఎక్స్ 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. ఇదే వేరియంట్ మోటో జీ5ఎస్ ప్లస్ ధర రూ.15,999గా ఉంది.

ముగింపు..

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ధరకు తగ్గ పనితీరును ఆఫర్ చేస్తున్నప్పటికి మోడ్రెన్ లుక్ అలానే పెర్ఫామెన్స్ పరంగా హానర్ 7ఎక్స్ మొదటి ప్లేస్‌లో నిలిచింది. తక్కువ బడ్జెట్‌లో ఎడ్జ్-టు-ఎడ్జ్ స్ర్కీన్, డ్యుయల్ - కెమెరా సెటప్ వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఉన్న ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారికి Honor 7Xను బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Check out our comparison of Moto G5S Plus and Honor 7X where we compared the features and specifications of both the smartphones. These budget smartphones offer dual-lens cameras and Android Nougat OS
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot