Honor 7X Vs Xiaomi Mi A1: రూ.13000లో బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఏది ?

గత కొద్ది నెలలుగా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

|

గత కొద్ది నెలలుగా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రూ.18,000లోపు స్మార్ట్‌ఫోన్‌లలో ఫ్లాగ్‌షిప్ డివైస్‌లతో సమానంగా హై-ఎండ్ ఫీచర్లు పొందుపరచబడుతున్నాయి. ఎడ్జ్ టు ఎడ్జ్ స్ర్కీన్, డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ వంటి విప్లవాత్మక ఫీచర్లు ప్రస్తుత మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రధాన హైలైట్స్‌గా నిలుస్తున్నాయి. గతంలో ఇటువంటి ఫీచర్లు హై-ఎండ్ ఫోన్‌లలో మాత్రమే కనిపించేవి.

 
Honor 7X and Xiaomi MiA1 sports Dual lens cameras

చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన హువావే.. 'హానర్ 6ఎక్స్’ పేరుతో మొట్టమొదటి లో-బడ్జెట్ డ్యుయల్-లెన్స్ కమెరా సెటప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఆ తరువాత నుంచి అనేక కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో డ్యుయల్ కెమెరా ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురావటం మొదలు పెట్టాయి.

రీసెంట్‌గా హువావే.. 'హానర్ 7ఎక్స్’ పేరుతో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యుయల్ కెమెరా ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. హానర్ 6ఎక్స్‌కు సక్సెసర్ వర్షన్‌గా లాంచ్ అయిన డివైస్‌కు 18:9 యాస్పెక్ట్ రేషియో స్ర్కీన్ మరో హైలైట్‌గా నిలస్తుంది. హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌కు మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న షావోమి Mi A1 నుంచి పోటీ ఎదురవుతోంది. ఈ రెండు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల బలాబలాలను పరిశీలించినట్లయితే..

డిజైన్ అండ్ డిస్‌ప్లే

డిజైన్ అండ్ డిస్‌ప్లే

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి డిజైన్ ఇంకా డిస్‌ప్లే విభాగాల పనితీరును విశ్లేషించినట్లయితే హానర్ 7ఎక్స్ బెస్ట్ పెర్ఫార్మర్‌గా అవతరించింది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియోతో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో ఎంఐ ఏ1 సాంప్రదాయ 16:9 యాస్పెక్ట్ రేషియోతో అప్ టు డేట్ మార్కును అందుకోలేక పోయింది.

ఈ రెండు పోన్‌లకు సంబంధించి స్ర్కీన్-టు-బాడీ రేషియోలను పరిశీలించినట్లయితే షావోమీ ఎంఐ ఏ1 బాడీ రేషియో 70.1%గాను, హానర్ 7ఎక్స్ బాడీ రేషియో 77%గాను ఉంది. మోడ్రన్ ఫీలింగ్, ఫ్యూచరిస్టిక్ లుకింగ్ వంటి అంశాలు హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13000 బడ్జెట్‌లో నెం.1గా నిలబెట్టాయి. ఎంఐ ఏ1తో పోలిస్తే హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో వీడియో ప్లేబ్యాక్, వెబ్ బ్రౌజింగ్, గేమ్‌ప్లే వంటి అంశాలు అత్యుత్తమంగా ఉంటాయి.

బ్యాటరీ ఇంకా స్టోరేజ్
 

బ్యాటరీ ఇంకా స్టోరేజ్

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ స్టోరేజ్ అంశాలను విశ్లేషించినట్లయితే హానర్ 7ఎక్స్ బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి హానర్ 7ఎక్స్ 3,340ఎమ్ఏహెచ్ ఇన్‌బిల్ట్ బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. ఇదే సమయంలో షావోమి ఎంఐ ఏ1 3,080ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్‌ను మాత్రమే కలిగి ఉంది.

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సమానమైన 64జీబి స్టోరేజ్ కెపాసిటీలతో వస్తున్నాయి. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా హానర్ 7ఎక్స్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. ఇదే సమయంలో ఎంఐ ఏ1 స్టోరేజ్ కెపాసిటీని మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా 128జీబి వరకు పెంచుకోవచ్చు.

గూగుల్ మ్యాప్‌లో మరో పవర్ పుల్ ఫీచర్గూగుల్ మ్యాప్‌లో మరో పవర్ పుల్ ఫీచర్

డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్

డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్

కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు డ్యుయల్ కెమెరా సెటప్‌లను కలిగి ఉన్నాయి. షావోమి ఎంఐ ఏ1, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా యూనిట్‌తో వస్తుంటే, హానర్ 7ఎక్స్ 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా యూనిట్‌తో వస్తోంది.

షావోమి ఎంఐ ఏ1లోకి 12 మెగా పిక్సల్ టెలీఫోటో లెన్స్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను ఆఫర్ చేస్తుంటే, హానర్ 7ఎక్స్‌లోని 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా డెప్త్ ఇన్ఫర్మేషన్‌ను మాత్రమే ఇస్తుంది. ఇమేజ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి హానర్ 7ఎక్స్, షావోమి ఎంఐ ఏ1తో పోలిస్తే డిటెయిలింగ్, కాంట్రాస్ట్ వంటి విభాగాల్లో మెరుగైన స్టాండర్డ్స్‌ను కలిగి ఉంది.

ప్రాసెసర్ ఇంకా సాఫ్ట్‌వేర్

ప్రాసెసర్ ఇంకా సాఫ్ట్‌వేర్

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి షావోమి ఎంఐ ఏ1 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 సీపీయూ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో హానర్ 7ఎక్స్ హైసిలికాన్ కైరిన్ 659 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ఈ రెండూ ఆక్టా-కోర్ చిప్ సెట్‌లే. ఎంఐ ఏ1లో నిక్షిప్తం చేసిన క్వాల్కమ్ స్రాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను 14ఎన్ఎమ్ తయారీ ప్రాసెస్ పై చేయగా, హానర్ 7ఎక్స్‌లో నిక్షిప్తం చేసిన కైరిన్ 659 సీపీయూ 1ఎన్ఎమ్ తయారీ ప్రాసెస్ పై డిజైన్ చేసారు.

పెర్ఫామెన్స్ పరంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సమానమైన పనితీరును ఆఫర్ చేస్తాయి. సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి షావోమీ ఎంఐ ఏ1 స్టాక్ ఆండ్రాయిడ్ నౌగట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఇదే సమయంలో హానర్ 7ఎక్స్ ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారంగా డిజైన్ చేసిన హువావే కస్టమైజిడ్ ఈఎమ్‌యూఐ 5.1 స్కిన్ పై రన్ అవుతుంది.

 ముగింపు..

ముగింపు..

మార్కెట్లో హానర్ 7ఎక్స్ ప్రారంభ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. ఇదే సమయంలో షావోమి ఎంఐ ఏ1 రూ.13,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. షావోమి ఎంఐ ఏ1తో పోలిస్తే హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్ బెటర్ డిజైన్, క్రిస్ప్ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ ఇంకా బెటర్ స్టోరేజ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లను ఎంపిక చేసుకునే విషయంలో అంతిమ నిర్ణయం మీదే.

Best Mobiles in India

Read more about:
English summary
We compared the Honor 7X with Xiaomi MiA1 to give you a better understanding of their features and specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X