6జీబి ర్యామ్‌తో హానర్ 8 ప్రో, ధర రూ.29,999

6జీబి ర్యామ్‌తో మరో స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. Honor 8 Pro పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.29,999. జూలై 10 నుంచి Amazon Indiaలో ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హానర్ 8కు అప్‌గ్రేడెడ్ మోడల్‌...

హానర్ 8 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ మోడల్‌గా మార్కెట్లో లాంచ్ అయిన హానర్ 8 ప్రో శక్తివంతమైన ఫీచర్లతో వస్తోంది.

శక్తివంతమైన బ్యాటరీ, డ్యుయల్ కెమెరా సెటప్

ఈ ఫోన్‌లోని శక్తివంతమైన బ్యాటరీ, డ్యుయల్ కెమెరా సెటప్, బెటర్ క్వాలిటీ ర్యామ్ వంటి అంశాలు హైఎండ్ ఫోన్‌లకు ధీటుగా ఉన్నాయి..

ప్రీమియమ్ లుక్‌..

హానర్ 8 ప్రో గ్లాస్ ఇంకా మెటల్ కాంభినేషన్‌లతో ప్రీమియమ్ లుక్‌ను ఆఫర్ చేస్తుంది. 5.7 అంగుళాల 2కే 1440పిక్సల్ ఎల్టీపీఎస్ డిస్‌ప్లే విత్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్.

హానర్ 8 స్పెసిఫికేషన్స్..

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ EMUI 5.1 కస్టమ్ స్కిన్, కైరిన్ 960 ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం,

కెమెరా, బ్యాటరీ....

12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్ విత్ Leica లెన్స్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (బ్లుటూత్ 4.2, వై-ఫై, హైబ్రీడ్ సిమ్ కార్డ్ స్లాట్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 8 Pro with 6GB RAM launched at Rs.29,999; sale debuts on July 10 via Amazon. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot