‘బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్’ ఏది?

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం నెలకుంది. యాపిల్, సామ్‌సంగ్, ఎల్‌జీ వంటి దిగ్గజ కంపెనీలు రూ.50,000 ధర రేంజ్‌లో ఆఫర్ చేస్తున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు ధీటుగా హువావే, వన్‌ప్లస్ వంటి బ్రాండ్‌లు సగం ధరకే అటువంటి ఫోన్‌ల‌ను అందించే ప్రయత్నం చేస్తున్నాయి.

 ‘బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్’ ఏది?

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే రూ.30,000 ధర రేంజ్‌లో వన్‌ప్లస్ 3, హువావే హానర్ 8 ఫోన్‌లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఈ మిడ్‌రేంజ్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు సంబంధించి స్పెసిఫికేషన్‌లను విశ్లేషించి చూసినట్లయితే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్ పరంగా చూస్తే..

డిజైన్ పరంగా చూస్తే, హానర్ 8 ఇంకా వన్‌ప్లస్ 3 ఫోన్‌లు మొదటి చూపులోనే ప్రీమియమ్ లుక్‌ను కలిగి‌స్తాయి. హైక్వాలిటీ మెటల్ ఇంకా గ్లాస్ కాంభినేషన్‌లో డిజైన్ చేయబడిన ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తాయి. వన్‌ప్లస్‌తో పోలిస్తే ఇన్నోవేటివ్‌గా ఆలోచించిన హువావే మరో అడుగు ముందుకు వేసి తన హానర్ 8 ఫోన్‌లో 2.5డి కర్వుడ్ గ్లాస్ బాడీని ఏర్పాటు చేసింది.

 

బ్యాక్ ప్యానల్స్‌ విషయానికొస్తే..

ఈ ఫోన్లకు సంబంధించి బ్యాక్ ప్యానల్స్‌ నిర్మాణ శైలిని విశ్లేషించి చూసినట్లయితే వన్‌ప్లస్ 3 ఫోన్ మెటాలిక్ రేర్ ప్యానల్‌ను కలిగి ఉంటుంది.ఇదే సమయంలో హానర్ 8 ఫోన్ 2.5 కర్వుడ్ గ్గాస్‌తో కలగలిపిన అల్యుమినియమ్ అలాయ్ ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ప్యానల్ ఫోన్‌కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకువచ్చింది.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి.. హానర్ 8 ఇంకా వన్‌ప్లస్ 3 ఫోన్‌లు, 1920x1080పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన హైక్వాలిటీ హైడెఫినిషన్ స్ర్ర్కీన్‌లతో వస్తున్నాయి. హానర్ 8 ఫోన్ 5.2 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుండగా, వన్‌ప్లస్ 3 ఫోన్ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. వన్‌ప్లస్ 3 ఫోన్‌తో పోలిస్తే హానర్ 8 ఫోన్ ఎక్కువ పిక్సల్స్‌ డెన్సిటీని ఆఫర్ చేస్తుండటం విశేషం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా విషయానికి వచ్చేసరికి..

కెమెరా విషయానికి వచ్చేసరికి.. హానర్ 8 ఇంకా వన్‌ప్లస్ 3 ఫోన్‌లు, హైక్వాలిటీ కెమెరాలతో వస్తున్నాయి. వీటిలో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీని ఆస్వాదించాలనుకునే వారికి మాత్రం హానర్ 8 ఉత్తమం. హానర్ 8 ఫోన్ కెమెరా ప్రత్యేకమైన హార్డ్‌వేర్‌తో వస్తోంది. ఈ హార్డ్‌వేర్‌లో నిక్షిప్లం చేసిన ఇన్నవేటివ్ బయోనిక్ 12 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ సిస్టం, హైక్వాలిటీ ఫోటోగ్రఫీని మీకు చేరువచేస్తుంది. ఈ డ్యుయల్ లెన్స్ పనితీరును విశ్లేషించినట్లయితే మొదటి లెన్స్.. ఫ్రేమ్‌ను రిచ్ కలర్‌లో క్యాప్చుర్ చేసేందుకు అవసరమైన వ్యవస్థను సమకూరుస్తుంది. ఇదే సమయంలో రెండవదైన మోనోక్రోమ్ లెన్స్.. ఫోటోలకు మరింత షార్ప్‌నెస్‌ను అద్ది అవసరమైన లైట్‌ను సమకూరుస్తుంది.

వన్‌ప్లస్ 3 కెమెరా..

ఇదే సమయంలో వన్‌ప్లస్ 3 ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ఈ కెమెరా క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తున్నప్పటికి హానర్ 8 కెమెరా క్వాలిటీతో పోటీపడలేదు.

హార్డ్‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్

హానర్ 8 ఇంకా వన్‌ప్లస్ 3 ఫోన్‌ల లోని హార్డ్‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్ అంశాలను పరిశీలించి చూసినట్లయితే, వన్‌ప్లస్ 3 ఫోన్ మార్కెట్లో లేటెస్ట్ సీపీయూ మోడల్ అయిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో వస్తోంది. ఇదే సమయంలో హానర్ 8 ఫోన్ సొంతంగా తయారు చేసుకున్న కైరిన్ 950 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తోంది. 

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి..

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ప్లాట్ ఫామ్ ఆధారంగా డిజైన్ చేసుకున్న పర్సనలైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లపై రన్ అవుతున్నాయి.

స్టోరేజ్ కెపాసిటీ..

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి.. హానర్ 8 ఫోన్ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఈ ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు వన్‌ప్లస్ 3 ఫోన్ 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీని ఆఫర్ చేస్తున్నప్పటికి మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ సదుపాయం లోపించింది.

ఇతర ఫీచర్లు..

అదనపు సెక్యూరిటీకి పెద్దపీట వేసిన ఈ రెండు ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను మీరు చూడొచ్చు. హానర్ 8 ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఫింగర్ ప్రింట్ స్ర్కానర్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయటమే కాకుండా, ఫోటోలు తీసుకోవటం, గ్యాలరీలోని ఫోటోలను బ్రౌజ్ చేయటం, నోటిఫికేషన్‌లను చెక్ చేసుకోవటం, అలారమ్‌ను డిస్మిస్ చేయటం వంటి టాస్క్‌లను నిర్వహించుకోవచ్చు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సమానమైన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్‌లతో వస్తున్నాయి.

అత్యుత్తమ హార్డ్‌వేర్ హంగులతో..

అత్యుత్తమ హార్డ్‌వేర్ హంగులతో వన్‌ప్లస్ 3 ఫోన్ హానర్ 8కు గట్టి పోటీ ఇచ్చినప్పటికి కెమెరా ఇంకా డిజైనింగ్ విభాగాల్లో మాత్రం వెనుకబడిపోయిందనే చెప్పాలి. స్టైల్‌తో పాటు హైక్వాలిటీ పనితీరును కోరుకునే వారికి Honor 8 ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 8 vs OnePlus 3: Find Out Who Wins the Title of Best Mid-Range Android Flagship Smartphone. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot