Honor 8X వచ్చేస్తోంది, మరో సంచలన ఫోన్‌ను మనం చూడబోతున్నామా?

హువావే సబ్సిడరీ బ్రాండ్ హానర్, Honor 8X పేరుతో మరో శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

|

హువావే సబ్సిడరీ బ్రాండ్ హానర్, Honor 8X పేరుతో మరో శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. హానర్ 7ఎక్స్‌‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టబోతోన్న ఈ డివైస్ అక్టోబర్ 16న భారత్‌లో విడుదలవుతుంది. ఈ మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ను కొద్ది గంటల క్రితమే దుబాయ్, యూఏఈ, మ్యాడ్రిడ్ ఇంకా స్పెయిన్ మార్కెట్లలో హానర్ లాంచ్ చేసింది. త్వరలోనే మలేషియా, రష్యా, చెక్ రిపబ్లిక్, థాయ్‌ల్యాండ్ మార్కెట్లలో కూడా ఈ డివైస్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు కంపెనీ తెలిపింది. హువావే తన హానర్ 8 ఎక్స్‌తో పాటు హానర్ 8 ఎక్స్‌ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ నెల ఆరభంలోనే చైనా మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

హానర్ 8ఎక్స్ ధర ఇంకా అందుబాటు..

హానర్ 8ఎక్స్ ధర ఇంకా అందుబాటు..

చైనా మార్కెట్లో హానర్ 8ఎక్స్ స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. వాటిలో మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరజ్ కెపాసిటీతో లభ్యమవుతోంది. అక్కడి కరెన్సీలో ఈ ఫోన్ విలువ CNY 1,399 (ఇండియన్ కరెన్సీలో రూ.14,900). రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరజ్ కెపాసిటీతో లభ్యమవుతోంది. అక్కడి కరెన్సీలో ఈ ఫోన్ విలువ CNY 1,599 (ఇండియన్ కరెన్సీలో రూ.17,100). ఇక మూడవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతోంది. అక్కడి కరెన్సీలో ఈ ఫోన్ విలువ CNY 1,899 (ఇండియన్ కరెన్సీలో రూ.20,300). ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధరలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే రివీల్ అయ్యే అవకాశం ఉంది.

 

 

హానర్ 8ఎక్స్ స్పెసిఫికేషన్స్..

హానర్ 8ఎక్స్ స్పెసిఫికేషన్స్..

6.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (1080x2340 పిక్సల్స్) టీఎఫ్టీ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, హైసిలికాన్ కైరిన్ 710ఎఫ్ సాక్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 20 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా యూనిట్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

హానర్ 7ఎక్స్‌‌కు అప్‌డేటెడ్ వెర్షన్..
 

హానర్ 7ఎక్స్‌‌కు అప్‌డేటెడ్ వెర్షన్..

ఇండియన్ మార్కెట్లో హానర్ 7ఎక్స్‌ డివైస్ గొప్ప విజయాన్ని అందుకున్న నేపథ్యంలో దానికి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా హానర్ 8ఎక్స్‌ డివైస్‌ను హువావే రంగంలోకి దింపబోతోంది. మార్కెట్లో హానర్ 7ఎక్స్ డివైస్ రెండు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్. ఈ ఫోన్ లను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

 

 

హానర్ 7ఎక్స్ స్పెసిఫికేషన్స్…

హానర్ 7ఎక్స్ స్పెసిఫికేషన్స్…

మెటల్ యునిబాడీ, 5.93 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (2160 x 1080 పిక్సల్స్) డిస్‌ప్లే విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ హువావే ఎమోషన్ 5.1 యూజర్ ఇంటర్‌ఫేస్, హువావే హైసిలికాన్ కైరిన్ 659 2.5గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ విత్ మాలీ టీ830-ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3340 ఎమ్ఏహెచ్ నాన్ - రిమూవబుల్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై (802.11 బీ/జీ/ఎన్), బ్లుటూత్ 4.1, జీపీఎస్, ఫోన్ చుట్టుకొలత 156.5 x 75.3 x 7.6 మిల్లీ మీటర్లు, బరువు 165 గ్రాములు.

 

 

Best Mobiles in India

English summary
Honor 8X India Launch Set for October 16, Global Variant Goes Official.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X