హానర్ 9 లైట్‌లో దుమ్మురేపుతున్న రైడ్ ఫీచర్, బడ్జెట్ ధరకే సొంతం

|

హువాయి సబ్ బ్రాండ్ హానర్ మార్కెట్లో దుమ్మురేపుతోంది. లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ మార్కెట్లోకి తన కొత్త ఫోన్లను తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది దూసుకువచ్చిన హానర్ 9 లైట్ లో అదిరిపోయే ఫీచర్ ని ప్రవేశపెట్టింది. హోటా (హూవాయ్ ఓవర్ ది ఎయిర్) ద్వారా "రైడ్ మోడ్" ఫీచర్‌తో హానర్ 9 లైట్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా భారతదేశంలో విడుదల చేసింది. బైక్‌ నడిపేటపుడు ఫోన్‌ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ.. ప్రధానంగా యువతే టార్గెట్‌గా ఈ ఫీచర్‌ను జోడించింది. తమ సరికొత్త రైడ్‌ మోడ్‌ ఫీచర్‌ లక్షలాది కస్టమర్లకు డ్రైవింగ్‌ సమయంలో సురక్షితమైన స్మార్ట్‌ఫోన్‌ వినియోగ బాధ్యతను గుర్తు చేస్తుందని హువాయ్‌ సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి. సంజీవ్‌ వెల్లడించారు.మరి దీని పనితీరుపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

రూ. 10కే జియో DTH సేవలు,లింక్ క్లిక్ చేసే ముందు ఇవి తెలుసుకోండిరూ. 10కే జియో DTH సేవలు,లింక్ క్లిక్ చేసే ముందు ఇవి తెలుసుకోండి

రైడ్‌ మోడ్‌ యాక్టివేషన్‌

రైడ్‌ మోడ్‌ యాక్టివేషన్‌

హానర్‌ 9 లైట్‌ కొత్తగా తీసుకొస్తున్న ఈ రైడ్‌మోడ్‌ ఫీచర్‌ను మెనూలోంచి డ్రాప్‌ డౌన్‌ నోటిఫికేషన్‌ ఆప్షన్‌ ఎంచుకుకోవడం ద్వారా గాని యాక్టివ్‌టే​ చేసుకోవచ్చు. లేదా ఫోన్‌ సెటింగ్స్‌లో రైడ్‌మోడ్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి.

బైక్‌ రైడింగ్‌లో ఉ‍న్నపుడు..

బైక్‌ రైడింగ్‌లో ఉ‍న్నపుడు..

యూజర్‌ బైక్‌ రైడింగ్‌లో ఉ‍న్నపుడు ఎవరైనా కాల్‌ చేస్తే.. వినియోగదారుడు ప్రస్తుతం డ్రైవింగ్‌లో ఉన్నారనీ...కాల్‌ ఆన్సర్‌ చేయలేరనే మెసేజ్‌ కాలర్స్‌కి అందుతుంది. అంతేకాదు ఒక వేళ అత్యవసరమైతే.. 1 నెంబర్‌ ప్రెస్‌ చేస్తే..కాల్‌ ఆటోమేటిగ్గా కనెక్ట్‌ అవుతుంది. ఈ సదుపాయం మార్చి చివరినాటికి తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని సంజీవ్‌ చెప్పారు.

 

హానర్ 9 లైట్ ఫీచర్లు
 

హానర్ 9 లైట్ ఫీచర్లు

5.65 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
కిరిన్ 659 ప్రాసెసర్
3జీబీ ర్యామ్,
32 జీబీ ఇంటెర్నెల్ మెమొరీ
256 జీబీ ఎక్స్‌టర్నల్ మెమొరీ
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
13 ఎంపీ +2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా
13 ఎంపీ +2 ఎంపీ డ్యుయల్‌ ఫ్రంట్‌ కెమెరా

ధర రూ.10,999

ధర రూ.10,999

ఈ ఫోన్ ధర రూ.10,999గా ఉంది. అయితే నాలుగు కెమెరాలతో బడ్జెట్‌ ధరలో లాంచ్‌ చేసిన ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి పెట్టిన ఆరు నిమిషాల్లోనే మొత్తం అమ్ముడైపోయాయి. ఈ ఫోన్ కోసం ఇప్పటికే చాలామంది ఎదురుచూస్తున్నారు.

Best Mobiles in India

English summary
Honor 9 Lite Gets Ride Mode Safety Feature; Honor 7X, Honor 9i to Follow More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X