ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా హానర్ 9 లైట్, ధర రూ. 11,700 మాత్రమే !

Written By:

హానర్ నుంచి వచ్చిన సెకండ్ క్వాడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్ హానర్ 9 లైట్ అతి త్వరలో ఇండియా మార్కెట్లోకి రానుంది. కంపెనీ నుంచి వచ్చిన రిపోర్టుల ప్రకారం అతి త్వరలోనే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. యూనిబాడీ డిజైన్‌తో పాటు నాలుగు కెమెరాలతో చైనా మార్కెట్లోకి గత డిసెంబర్లో ఈ ఫోన్ రంగ ప్రవేశం చేసింది. అక్కడ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. CNY 1,199గా ఉంది. మన ఇండియన్ కరెన్సీలో దీని ధర రూ.11,700గా ఉండే అవకాశం ఉంది. కాగా ఇది 3జిబి ర్యామ్, 32 స్టోరేజ్ వేరియంట్ ధర. అలాగే 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ CNY 1,799గా సుమారు 17,500గా నిర్ణయించింది. కాగా ఇండియాలో ఈ ఫోన్ ధరలు అదే విధంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Honor View 10 vs OnePlus 5T : మీ డబ్బుకు న్యాయం చేసే స్మార్ట్‌ఫోన్ ఏది ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొత్తం 14 దేశాల్లో..

కంపెనీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఫోన్ మొత్తం 14 దేశాల్లో ఒకేసారి లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇండియా, రష్యా, యుకె మార్కెట్లలో ఇది లాంచ్ అయ్యే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది.

4జిబి ర్యామ్ వేరియంట్ మాత్రమే..

కాగా కంపెనీ నుంచి ఇప్పటికే హానర్ 7ఎక్స్, హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్లు ఇండియా మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే ఈ ఫోన్‌ను వెబ్‌సైట్లో లిస్ట్ చేసింది. కాగా ఇండియాలో హానర్ 9 లైట్ 4జిబి ర్యామ్ వేరియంట్ మాత్రమే లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హానర్ 9 లైట్ స్పెషిఫికేషన్స్

5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 7ఎక్స్ ఫీచర్లు

5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
2.5డి కర్వ్‌డ్ గ్లాస్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
32/64 జీబీ స్టోరేజ్
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3340 ఎంఏహెచ్ బ్యాటరీ

హానర్ వ్యూ 10 స్పెషిఫికేషన్స్

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 9 Lite India Launch Confirmed, Will Be a Flipkart-Exclusive more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot