మీ డబ్బుకి న్యాయం చేసే స్మార్ట్‌ఫోన్ హానర్ 9 లైట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి !

Written By:

ఇండియాలో రోజు రోజుకు స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపధ్యంలో దిగ్గజ కంపెనీలన్నీ లేటెస్ట్ ఫీచర్లతో తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి వదులుతున్నాయి. విదేశీ కంపెనీలకు పోటీగా దేశీయ కంపెనీలు కూడా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న మొబైల్స్ ను రిలీజ్ చేస్తూ మార్కెట్లో సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నాయి. దీంతో బడ్జెట్ రేంజులో మంచి ఫీచర్ల ఫోన్ సెలక్ట్ చేసుకోవాలంటే వినియోగదారులకు కత్తిమీద సామే..అయితే హానర్ నుంచి వచ్చిన హానర్ 9 లైట్ ఫోన్ మీ బడ్జెట్ కి న్యాయం చేస్తుందని కంపెనీ చెబుతోంది ఎలాగో ఓ లుక్కేయండి.

BSNL యూజర్లకు షాక్, సండే ఉచిత కాల్స్ రద్దు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హానర్ 9 లైట్ ఫీచర్లు

18: 9 ఆస్పెక్ట్ రేషియోతో పాటు 5.65 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్ప్లేతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి వేరియెంట్స్ వరుసగా రూ .10,999, రూ .14,999.
హువావ్ హానర్ 9 లైట్ స్పెషిఫికేషన్స్
5.65 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 2.5 డి ఎమ్ 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకార్ ప్రాసెసర్, 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి స్టోరేజ్, 256 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ సెల్ఫ్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4 జీ వివోఎల్టీ, బ్లూటూత్ 4.2, 3000 ఎఎహెచ్ బ్యాటరీ.

డిజైన్

హానర్ 9 లైట్ shiny glass డిజైన్ తో వచ్చింది. ఈ రకమైన డిజైన్ ద్వారా వినియోగదారుల చేతుల్లో మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది. Sapphire Blue, Midnight Black and Glacier Grey లాంటి మూడు కలర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఇట్టే అకట్టుకోనుంది. దీంతో పాటు 18: 9 ఆస్పెక్ట్ రేషియోతో పాటు 5.65 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది.

కెమెరా

హువాయి కంపెనీ ఎప్పుడు ఏ ఫోన్ రిలీజ్ చేసినా ముందుగా ఫోకస్ చేసేది ఫోటోగ్రఫీ మీదనే అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆ కంపెనీ నుంచి వచ్చే ఫోన్లు డ్యూయెల్ లెన్స్ కెమెరాను కలిగి ఉంటాయి. అలాగే హానర్ 9 లైట్ కూడా 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ సెల్ఫ్ కెమెరాలతో ముందుకు దూసుకువచ్చింది. ఇతర బడ్జెట్ ఫోన్లతో పోలిస్తే ఈ విషయంలో ఈ ఫోన్ కాస్త మెరుగైనదే అని చెప్పవచ్చు.

రిజల్యూషన్

రూ.15 వేల బడ్జెట్ రేంజులో ఈ రకమైన రిజల్యూషన్ చాలా తక్కువ ఫోన్లలో ఉంటుంది. అలాగే 18: 9 ఆస్పెక్ట్ రేషియో కూడా అతి తక్కువగా కనిపిస్తుంది. హానర్ 9 లైట్ లో ఈ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో ఈ ఫోన్ వినియోగదారులను మరింతగా ఆకట్టుకోనుంది.

ధర

ఈ ధరలో మరే ఇతర ఫోన్ ఈ రకమైన ఫీచర్లను ఆఫర్ చేయడం లేదనే చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అయ్యే ఈ ఫోన్ యూజర్లు పెట్టిన మనీకి న్యాయం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 9 Lite is a total value for money deal for millennials more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot