అమ్మకానికి వచ్చిన ఆరు నిమిషాలకే అవుట్ ఆఫ్ స్టాక్ !

హువాయి సబ్ బ్రాండ్ హానర్ 9 లైట్ అమ్మకానికి వచ్చిన ఆరునిమిషాలకే అవుట్ ఆఫ్ స్టాక్ అయింది.

By Hazarath
|

హువాయి సబ్ బ్రాండ్ హానర్ 9 లైట్ అమ్మకానికి వచ్చిన ఆరునిమిషాలకే అవుట్ ఆఫ్ స్టాక్ అయింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కి వచ్చిన ఆరు నిమిషాల్లోనే అమ్మకాలు జరిగాయని ఇది ఓ రికార్డు సేల్ అని తెలిపింది. వినియోగదారుల నుంచి ఇంత ఆసక్తి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. సరసమైన ధరలో అత్యాధునిక ఫీచర్లు అందించడం వల్లే హానర్‌ 9 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ సక్సెస్‌కు కారణమని వివరించారు. కాగా ముందు, వెనుక డ్యుయల్‌ కెమెరాలు ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పవచ్చు.

జియో డబుల్ డేటా ఆఫర్, అయితే వారికి మాత్రమేనట !జియో డబుల్ డేటా ఆఫర్, అయితే వారికి మాత్రమేనట !

హానర్ 9 లైట్ ఫీచర్లు, ధర

హానర్ 9 లైట్ ఫీచర్లు, ధర

18: 9 ఆస్పెక్ట్ రేషియోతో పాటు 5.65 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్ప్లేతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి వేరియెంట్స్ వరుసగా రూ .10,999, రూ .14,999. హువావ్ హానర్ 9 లైట్ స్పెషిఫికేషన్స్

5.65 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 2.5 డి ఎమ్ 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకార్ ప్రాసెసర్, 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి స్టోరేజ్, 256 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ సెల్ఫ్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4 జీ వివోఎల్టీ, బ్లూటూత్ 4.2, 3000 ఎఎహెచ్ బ్యాటరీ.

డిజైన్

డిజైన్

హానర్ 9 లైట్ shiny glass డిజైన్ తో వచ్చింది. ఈ రకమైన డిజైన్ ద్వారా వినియోగదారుల చేతుల్లో మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది. Sapphire Blue, Midnight Black and Glacier Grey లాంటి మూడు కలర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఇట్టే అకట్టుకోనుంది. దీంతో పాటు 18: 9 ఆస్పెక్ట్ రేషియోతో పాటు 5.65 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది.

కెమెరా

కెమెరా

హువాయి కంపెనీ ఎప్పుడు ఏ ఫోన్ రిలీజ్ చేసినా ముందుగా ఫోకస్ చేసేది ఫోటోగ్రఫీ మీదనే అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆ కంపెనీ నుంచి వచ్చే ఫోన్లు డ్యూయెల్ లెన్స్ కెమెరాను కలిగి ఉంటాయి. అలాగే హానర్ 9 లైట్ కూడా 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ సెల్ఫ్ కెమెరాలతో ముందుకు దూసుకువచ్చింది. ఇతర బడ్జెట్ ఫోన్లతో పోలిస్తే ఈ విషయంలో ఈ ఫోన్ కాస్త మెరుగైనదే అని చెప్పవచ్చు.

రిజల్యూషన్

రిజల్యూషన్

రూ.15 వేల బడ్జెట్ రేంజులో ఈ రకమైన రిజల్యూషన్ చాలా తక్కువ ఫోన్లలో ఉంటుంది. అలాగే 18: 9 ఆస్పెక్ట్ రేషియో కూడా అతి తక్కువగా కనిపిస్తుంది. హానర్ 9 లైట్ లో ఈ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో ఈ ఫోన్ వినియోగదారులను మరింతగా ఆకట్టుకోనుంది.

ధర

ధర

ఈ ధరలో మరే ఇతర ఫోన్ ఈ రకమైన ఫీచర్లను ఆఫర్ చేయడం లేదనే చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అయ్యే ఈ ఫోన్ యూజర్లు పెట్టిన మనీకి న్యాయం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Best Mobiles in India

English summary
Honor 9 Lite sold out within record six minutes on Flipkart More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X