200MP కెమెరా, 6.7 అంగుళాల స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. రూ.3000 తగ్గింపు సహా అమెజాన్ సేల్ పూర్తి వివరాలు!
హానర్ సంస్థ గత సంవత్సరం సెప్టెంబర్‌లో హానర్ 90 స్మార్ట్ ఫోన్‌ను (Honor 90 Smartphone Discount) లాంచ్ చేసింది. డిజైన్, ఫీచర్ల పరంగా ఈ హ్యండ్ సెట్ ఆకట్టుకుంది. ముఖ్యంగా డిస్‌ప్లే, కెమెరా విభాగం పనితీరుతో కనబరిచింది. ఈ ఫోన్ మరోసారి తగ్గింపు ధరను పొందింది.
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫాం అమెజాన్‌లో (Amazon) ఈ హానర్ హ్యాండ్ సెట్‌పై డిస్కౌంట్ ను ప్రకటన చేసింది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై తగ్గింపును కూడా పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. EMI, ఎక్స్చేంజీ ఆఫర్లను పొందవచ్చు.

హానర్ 90 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు :
హానర్ 90 స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల 1.5k కర్వడ్ అమోలెడ్ 120Hz స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 3840Hz డిమ్మింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌తో వస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత మేజిక్OS 7.1 పైన పనిచేస్తుంది.
200MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా:
హానర్ 90 స్మార్ట్‌ఫోన్ 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. 12MP ఆల్ట్రావైడ్ మరియు 2MP డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. అదే ముందువైపు 50MP కెమెరాతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ వైఫై, బ్లూటూత్, NFC, USB-C ఛార్జింగ్‌తో వస్తుంది.

రెండు వేరియంట్లలో లభిస్తుంది :
ఈ స్మార్ట్‌ఫోన్ 66W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ మరియు 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3000 తగ్గింపు :
హానర్ 90 స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.27,999 గా ఉంది. మరియు 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ ధర రూ.29,999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా (Honor 90 Amazon Offer) కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు.
ఎక్స్చేంజీ ఆఫర్ :
దీంతోపాటు ఎక్స్చేంజీ చేయడం ద్వారా 512 స్టోరేజీ వేరియంట్ పై రూ.28,499 వరకు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు EMI ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మిడ్ నైట్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్లు ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








