మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఆకట్టుకుంటున్న హానర్ 9N
హువాయి బ్రాండ్ హానర్ నుంచి మీడియం రేంజ్ ధరలో బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9N దూసుకువచ్చింది.
హువాయి బ్రాండ్ హానర్ నుంచి మీడియం రేంజ్ ధరలో బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9N దూసుకువచ్చింది. 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు రూ.11,999, రూ.13,999 ధరలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ నెల 21 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 5.84-inch Full HD+ displayతో పాటు 13MP+2MP డ్యూయెల్ లెన్స్ కెమెరాతో వచ్చిన ఈ మొబైల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. Gray, Blue, Black లాంటి మూడు రంగుల్లో లభ్యమైన ఈ ఫోన్ 4జిబి ర్యామ్ తో వచ్చింది. ఫీచర్ల విషయానికొస్తే..

హానర్ 9ఎన్ ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Gameplay and video playback
ఈ ఫోన్ ప్రధానంగా గేమింగ్ ప్రియులకు నచ్చేలా డిజైన్ చేశారు. పుల్ ఐపీఎస్ LCD FullView displayతో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించనుంది. పుల్ వ్యూ స్క్రీన్ ద్వారా ఆకట్టుకునే రంగులో ేమ్ ఆడేవారికి టీవీ ముందు కూర్చుని ఆడుతున్న అనుభూతిని కలిగించనుంది.

Comfortable Reading Experience
Eye comfort ఫీచర్ తో రావడం వల్ల యూజర్లు తమకు ఇష్టమైన బుక్స్ కాని వెబ్ సైట్లు కాని ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు కళ్లకు ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తుంది. యూజర్లు కంఫర్టబుల్ అనుభవాన్ని దీని ద్వారా పొందుతారు.

Multitask
మల్టీ టాస్క్ ఫీచర్ ద్వారా డైనమిక్ విజువల్ అనుభూతిని మీరు అందుకోవచ్చు. మీరు సోషల్ మీడియాలో ఏదైనా వీడియోని కిందకు పైకి నెడుతున్నప్పుడు మీరు అది స్ట్రక్ అవడం కాని లేక ఇబ్బందికి గురిచేయడం కాని జరగదు.

క్యాష్‌బ్యాక్
ఈ ఫోన్‌పై జియో రూ.2200 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. 100 జీబీ అదనపు మొబైల్ డేటా జియో యూజర్లకు లభిస్తుంది. అలాగే మింత్రాకు చెందిన రూ.1200 విలువైన వోచర్లు లభిస్తాయి.


Click it and Unblock the Notifications








