హానర్ నుంచి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్, స్టన్నింగ్ ఫీచర్లపై ఓ లుక్కేయండి

హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్ల రంగంలో మరో విప్లవం సృష్టించడానికి రెడీ అయింది. ఈ నేపథ్యంలో తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన Honor 9N మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది.ఈ రోజు లాంచ్ ఈవెంట్ జరగనుంది

By Anil
|

హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్ల రంగంలో మరో విప్లవం సృష్టించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన Honor 9N మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఇండియాలో ఈ రోజు లాంచ్ ఈవెంట్ జరగనుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ గతంలో వచ్చిన Honor 9i ఫోన్ కు రిబ్రాండెడ్ వెర్షన్ లా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇండియా మార్కెట్లో Honor 9N స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ. 15,000 నుంచి రూ. 18,000 లోపు ఉండవచ్చని అంచనా. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ లో ఎక్సక్లూజివ్ గా అమ్మకానికి రానుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లైవ్ ఈవెంట్ ని అభిమానులు కంపెనీ Facebook, YouTube, Twitter ద్వారా తిలకించవచ్చు. ఈ ఫోన్ ఫీచర్స్ కింది విధంగా ఉన్నాయి.

మనుగడ ప్రశ్నార్థకం, అనిల్ అంబానీకి మరో భారీ దెబ్బ !మనుగడ ప్రశ్నార్థకం, అనిల్ అంబానీకి మరో భారీ దెబ్బ !

డిస్‌ప్లే :

డిస్‌ప్లే :

5.84 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2,160x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే Games, videos and web pagesలాంటి పనులు చేసే సమయంలో ఇది మంచి అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ :

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ :

అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన octa-core processorతో పాటు Kirin 659తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ RAM 64 జీబీ /128 జీబీ storage లలో లభ్యమవుతోంది. FM radio, Bluetooth 4.2, Wi-Fi, 4G with VoLTE and USB-OTG.అదనపు ఆకర్షణలు.

కెమెరా :

కెమెరా :

రెండు రకాల డ్యూయెల్ కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది.బ్యాక్ కెమెరా విషయానికొస్తే 13MP+2MP cameraతో వినియోగదారులు మంచి ఫోటోలు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు.అలాగే సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 16Mp తో మంచి క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలు తీసుకునేలా కల్పించారు.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ:

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ:

ఈ Honor 9N స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3000 ఎమ్ ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 18,000 లోపు ఉండవచ్చు అని అంచన.

Honor 9N ఫీచర్స్ :

Honor 9N ఫీచర్స్ :

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కిరిన్ 659 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64/128 జీబీ ర్యామ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13+2 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 8.0 Oreo , 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 4.2.

గతంలో వచ్చిన  Honor 9i ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి:

గతంలో వచ్చిన Honor 9i ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి:

5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, లౌడ్ స్పీకర్, కిరిన్ 659 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ర్యామ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13+2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 16+2 మెగాపిక్సల్ రియర్ కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకత. 3340 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్‌, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2.

 

 

Best Mobiles in India

English summary
Honor is all for the launch of its notchy smartphone, aka, the Honor 9N in India, which is a rebranded version of the Honor 9i (2018), which is currently available in China.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X