రూ. 11,999కే హానర్ 9ఎన్, ఆకట్టుకునే ఫీచర్లు ఇవే

హువాయి సబ్‌బ్రాండ్ హానర్ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ ఇండియాకు తీసుకు వచ్చింది.

|

హువాయి సబ్‌బ్రాండ్ హానర్ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ ఇండియాకు తీసుకొచ్చింది. తన లేటెస్ట్‌ హ్యాండ్‌సెట్‌ హానర్‌ 9ఎన్‌ ను కంపెనీ న్యూఢిల్లీ వేదికగా లాంచ్‌ చేసింది. కాగా ఈ ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయానికి రానుంది. నాచ్‌ ఫుల్‌వ్యూ' డిస్‌ప్లే, 19:9 యాక్సెప్ట్‌ రేషియోతో బెజెల్‌-లెస్‌ డిస్‌ప్లేను, 12 లేయర్‌ ప్రీమియం గ్లాస్‌ డిజైన్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈగత నెలలో చైనాలో లాంచ్‌ అయిన హానర్‌ 9ఐ(2018) మోడల్‌ పేర మార్చి ఇండియాలో హానర్‌ 9ఎన్‌గా కంపెనీ రిలీజ్ చేసింది.

వాట్సప్ గ్రూపు అడ్మిన్ అయినందుకు 5 నెలలుగా జైల్లోనే, మెసేజ్ ఏంటంటే ?వాట్సప్ గ్రూపు అడ్మిన్ అయినందుకు 5 నెలలుగా జైల్లోనే, మెసేజ్ ఏంటంటే ?

 హానర్ 9ఎన్ ఫీచర్లు

హానర్ 9ఎన్ ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌, 2.36 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, రియర్‌ ఫేసింగ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్‌ 9ఎన్‌ ధర

హానర్‌ 9ఎన్‌ ధర

హానర్‌ 9ఎన్‌(2018) 3జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.11,999 కాగ, 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 13,999 రూపాయలు. ఇక 4జీబీ ర్యామ్‌/128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 17,999 రూపాయలుగా కంపెనీ పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్‌, హాయ్‌ హానర్‌ స్టోర్‌ల ద్వారా..

ఫ్లిప్‌కార్ట్‌, హాయ్‌ హానర్‌ స్టోర్‌ల ద్వారా..

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌, హాయ్‌ హానర్‌ స్టోర్‌ల ద్వారా జూలై 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి వస్తుంది. లావెండర్‌ పర్‌పుల్‌, రాబిన్‌ ఎగ్‌ బ్లూ, మిడ్‌నైట్‌ బ్లాక్‌, సఫైర్‌ బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

రిలయన్స్‌ జియో

రిలయన్స్‌ జియో

ఈ స్మార్ట్‌ఫోన్‌పై రిలయన్స్‌ జియో రూ.2200 క్యాష్‌బ్యాక్‌ ప్రకటించింది. 100 జీబీ అదనపు డేటా, 1200 మింత్రా ఓచర్లు కూడా పొందనున్నారు.

హానర్‌ 9ఐ 2017

హానర్‌ 9ఐ 2017

కాగా గతేడాది అక్టోబర్‌లో హానర్‌ 9ఐ 2017ను భారత మార్కెట్‌లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సక్సెసర్‌గా.. మేడిన్‌ ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా ఇప్పుడు తీసుకువచ్చిన హానర్ 9ఎన్‌ను కంపెనీ ప్రకటించింది.

హువావే హానర్ 9ఐ ఫీచర్లు

హువావే హానర్ 9ఐ ఫీచర్లు

5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Honor 9N India launch Highlights: Price starts at Rs 11,999, Flipkart sale from July 31 more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X