Home
Mobile

Rs.2,000 డిస్కౌంట్ ఆఫర్ తో ఫ్లిప్‌కార్ట్‌లో హానర్ 9X సేల్స్

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం జరుగుతున్న సేల్స్ సందర్బంగా హానర్ 9X స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం గొప్ప ఆఫర్లతో అందిస్తున్నది. ఎప్పటి నుంచో ఊరిస్తున్న హానర్ 9X మొబైల్ గత వారం ఇండియాలో లాంచ్ అయింది. ఇప్పుడు మొదటి సారిగా వినియోగదారులకు అమ్మకానికి ఫ్లిప్‌కార్ట్‌లో ఉంచింది. ఫ్లిప్‌కార్ట్‌ యొక్క రిపబ్లిక్ డే సేల్స్ యొక్క ప్రత్యేక ఆఫర్లలో భాగంగా హానర్ 9X మీద రూ.2,000 వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నారు.

హానర్ 9X

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు పాప్-అప్ సెల్ఫీ స్నాపర్ గల హానర్ 9X యొక్క సేల్స్ ప్రస్తుతం ఇండియాలో మొదలయినాయి. సరికొత్త హానర్ సమర్పణలో 4 జీబీ, 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ ఆప్షన్స్ ఉన్నాయి. హానర్ 9X వెనుకవైపు 48 మెగాపిక్సెల్ కెమెరాతో మరియు ముందు వైపు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ తో ప్యాక్ చేయబడి ఉన్నాయి.

 

 

ధరల వివరాలు

ధరల వివరాలు

హానర్ 9X యొక్క 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ కోసం రూ.13,999 ధరను కలిగి ఉండగా ఇందులో టాప్ ఎండ్ మోడల్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ యొక్క ధరరూ.16,999 గా ఉంది. ఇది మిడ్నైట్ బ్లాక్ మరియు నీలమణి బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

 

 

ఆఫర్స్

ఆఫర్స్

అమ్మకపు ఆఫర్లలో భాగంగా మొదటి రోజున హానర్ 9X యొక్క 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ మీద రూ.1,000 తగ్గింపును అందించింది. అంటే దీనిని కేవలం రూ.12,999లకు అందించింది. ఈ రోజు నుండి అంటే జనవరి 20 నుండి 22 వరకు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు కోటక్ మహీంద్రా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ మీద దీనిని కొనుగోలు చేసిన హోల్డర్లకు 10 శాతం బ్యాంకింగ్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.2,200 విలువైన జియో యొక్క ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ జియో ప్రయోజనాలు రూ.249 మరియు రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ ల కింద జనవరి 19 నుండి 3 నెలల వ్యవధిలో చెల్లుతుంది.

 

 

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

కొత్తగా ప్రారంభించిన హానర్ 9X స్మార్ట్‌ఫోన్ 19.5: 9 కారక నిష్పత్తితో మరియు ఫుల్ HD + రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే డ్యూయల్ 3D కర్వ్డ్ ప్యానెల్‌తో వస్తుంది. ఇది వీడియోలను చూడటానికి మెరుగైన డైనమిక్ రేంజ్ ఫీచర్‌తో వస్తుంది. ఈ ఫీచర్ రియల్ టైంలో వీడియోల యొక్క నాణ్యతను పెంచుతుంది. ఈ ఫోన్‌లో 6 జీబీ వరకు ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్నాయి. మెమరీని 512 జీబీ వరకు విస్తరించడానికి ఇందులో మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది.

 

 

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 120-డిగ్రీల వ్యూ యాంగిల్‌తో 8 మెగాపిక్సెల్ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ పాప్-అప్ కెమెరాను కలిగి ఉంది. మెరుగైన కెమెరా పనితీరు కోసం ఫోన్ అల్ట్రా హై ISO మరియు AIS సూపర్ నైట్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

 

 

కనెక్టివిటీ

కనెక్టివిటీ

ఇది మెరుగైన గేమింగ్ పనితీరు కోసం GPU టర్బో 3.0 తో వస్తుంది. ఇది 4,000mAh బ్యాటరీ మద్దతుతో ప్యాక్ చేయబడి వస్తుంది. హానర్ 9x స్మార్ట్‌ఫోన్ హువాయి సంస్థ తయారుచేసిన కిరిన్ 710F ఆక్టా-కోర్ SoC ద్వారా రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ పై EMUI 9.1 తో రన్ అవుతుంది. కనెక్టివిటీ ఎంపికలలో ఇది హ్యాండ్‌సెట్ బ్లూటూత్ 5, జిపిఎస్, వై-ఫై, USB టైప్-C మరియు డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్‌లకు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ యాక్సిస్ కోసం వెనుకవైపు మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

ఫీచర్స్

ఫీచర్స్

హానర్ 9X స్మార్ట్‌ఫోన్ యొక్క డిజైన్ వినూత్నంగా ఉంది. ఇది డైనమిక్ X డిజైన్ ను కలిగి ఉంటుంది. రెండు వైపులా డ్యూయల్ 3D కర్వ్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. దీని యొక్క తయారీలో అనేక రకాల టెస్ట్ లను పరీక్షించారు. ఇది 70kg ల వరకు బెండ్ ను తట్టుకోగలరు. అలాగే ఇది సుమారు 5 నుంచి 8 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన కూడా ఏమి అవ్వని టెక్నాలజీతో తయారుచేసారు. పాప్-అప్ కెమెరా కూడా సుమారు పాటి ఒత్తిడులను తట్టుకోగలదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor 9X Sales on Flipkart With a Discount Offer of Rs.2,000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X