Honor 9X స్మార్ట్‌ఫోన్ రిలీజ్... సేల్స్ ఆఫర్స్ అదుర్స్....

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ 2020 సంవత్సరంలో తన మొదటి ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసింది. డిల్లీలో ఈ రోజు జరిగిన లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో హానర్ 9X ను విడుదల చేసారు. హానర్ సంస్థ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్ తో పాటుగా హానర్ మ్యాజిక్ వాచ్ 2, హానర్ బ్యాండ్ 5i ,హానర్ స్పోర్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మరియు హానర్ స్పోర్ట్ ప్రో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వంటి ఇతర డివైస్లను కూడా విడుదల చేసింది.

హానర్ 9X ధరల వివరాలు
 

హానర్ 9X ధరల వివరాలు

ఇండియాలో హానర్ 9X స్మార్ట్ ఫోన్ ను రెండు స్టోరేజ్ వేరియంట్ లలో విడుదల చేసింది. ఇందులో 4GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 మరియు 6GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర 16,999 రూపాయలు.

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్‌ ఫ్రీగా అందిస్తున్న ఆఫర్స్ ఏమిటో తెలుసా?

ఆఫర్స్ & లభ్యత

ఆఫర్స్ & లభ్యత

హానర్ 9X ను జనవరి 19 నుండి 22 వరకు ఫ్లిప్‌కార్ట్ లో జరుగుతున్న ఇండిపెండెన్స్ సేల్స్ సందర్బంగా కొనుగోలు చేయవచ్చు. ఇది సాఫిర్ బ్లూ మరియు బ్లాక్ వంట రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ లో ఐసీఐసీఐ మరియు కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల మీద 10శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే రిలయన్స్ జియో కస్టమర్లు రూ.7,550 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.

సెట్-టాప్ బాక్స్‌ల ధరలను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టివి

హానర్ 9X

ఆండ్రాయిడ్ 9 పైతో హానర్ 9X స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతానికి రన్ అవుతుంది. ముఖ్యంగా హానర్ సంస్థ ఇటీవల హానర్ 9X కోసం ఆండ్రాయిడ్ 10 బీటా అప్‌డేట్‌ను కూడా విడుదల చేసింది. 2020 లో క్యూ 1 లో హానర్ 9X ఆండ్రాయిడ్ 10 స్టేబుల్ అప్‌డేట్ చైనాలో ప్రారంభమవుతుందని నివేదించబడింది. భారతదేశంలో కూడా ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను విడుదల చేయగలదని ఇది సూచిస్తుంది.

విండోస్ 7 వాడుతున్న వారికి కష్టాలు ఇక తప్పవు!!!

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

కొత్తగా ప్రారంభించిన హానర్ 9X స్మార్ట్‌ఫోన్ 19.5: 9 కారక నిష్పత్తితో మరియు ఫుల్ HD + రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే డ్యూయల్ 3D కర్వ్డ్ ప్యానెల్‌తో వస్తుంది. ఇది వీడియోలను చూడటానికి మెరుగైన డైనమిక్ రేంజ్ ఫీచర్‌తో వస్తుంది. ఈ ఫీచర్ రియల్ టైంలో వీడియోల యొక్క నాణ్యతను పెంచుతుంది. ఈ ఫోన్‌లో 6 జీబీ వరకు ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్నాయి. మెమరీని 512 జీబీ వరకు విస్తరించడానికి ఇందులో మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది.

RS.100 కన్నా తక్కువ ధరతో స్మార్ట్ ఛానల్ ప్యాక్‌లను అందిస్తున్న టాటా స్కై

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 120-డిగ్రీల వ్యూ యాంగిల్‌తో 8 మెగాపిక్సెల్ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ పాప్-అప్ కెమెరాను కలిగి ఉంది. మెరుగైన కెమెరా పనితీరు కోసం ఫోన్ అల్ట్రా హై ISO మరియు AIS సూపర్ నైట్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

వాట్సాప్ మెసేజ్ లను రహస్యంగా చదవడం ఎలా?

కనెక్టివిటీ

కనెక్టివిటీ

ఇది మెరుగైన గేమింగ్ పనితీరు కోసం GPU టర్బో 3.0 తో వస్తుంది. ఇది 4,000mAh బ్యాటరీ మద్దతుతో ప్యాక్ చేయబడి వస్తుంది. హానర్ 9x స్మార్ట్‌ఫోన్ హువాయి సంస్థ తయారుచేసిన కిరిన్ 710F ఆక్టా-కోర్ SoC ద్వారా రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ పై EMUI 9.1 తో రన్ అవుతుంది. కనెక్టివిటీ ఎంపికలలో ఇది హ్యాండ్‌సెట్ బ్లూటూత్ 5, జిపిఎస్, వై-ఫై, USB టైప్-C మరియు డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్‌లకు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ యాక్సిస్ కోసం వెనుకవైపు మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

ఫీచర్స్

ఫీచర్స్

కొత్తగా ప్రారంభించిన హానర్ 9X స్మార్ట్‌ఫోన్ యొక్క డిజైన్ వినూత్నంగా ఉంది. ఇది డైనమిక్ X డిజైన్ ను కలిగి ఉంటుంది. రెండు వైపులా డ్యూయల్ 3D కర్వ్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. దీని యొక్క తయారీలో అనేక రకాల టెస్ట్ లను పరీక్షించారు. ఇది 70kg ల వరకు బెండ్ ను తట్టుకోగలరు. అలాగే ఇది సుమారు 5 నుంచి 8 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన కూడా ఏమి అవ్వని టెక్నాలజీతో తయారుచేసారు. పాప్-అప్ కెమెరా కూడా సుమారు పాటి ఒత్తిడులను తట్టుకోగలదు.

హానర్ స్మార్ట్ డివైస్లు

హానర్ స్మార్ట్ డివైస్లు

హానర్ 9 ఎక్స్ తో పాటు కంపెనీ స్మార్ట్ వాచ్ - మ్యాజిక్ వాచ్ 2 , ఫిట్నెస్ ట్రాకర్ - హానర్ 5i మరియు రెండు వైర్‌లెస్ ఇయర్ ఫోన్‌లను కూడా ఇండియాలో విడుదల చేసింది. హానర్ మ్యాజిక్ వాచ్ 2 ధర రూ.12,999 వద్ద ప్రారంభం అవుతున్నది. ఫిట్నెస్ ట్రాకర్ బ్యాండ్ 5i యొక్క ధర 1,999 రూపాయల నుండి ప్రారంభం అవుతుంది. ఈ రెండు పరికరాలు 2020 జనవరి 19 నుండి అమెజాన్ ఇండియా ద్వారా విక్రయించబడతాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Honor 9X Smartphone Launched in India: India Price, Specifications, Sale date and Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X