నెం.1 ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, Xiaomiకి షాకిచ్చిన Honor

హువావే ఆన్‌లైన్ బ్రాండ్ Honor, నెం.1 గ్లోబల్ ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించరింది. 2017 మొదటి క్వార్టర్ అమ్మకాలకు సంబంధించి IDC విడుదల చేసి రిపోర్ట్ ప్రకారం హానర్ బ్రాండ్‌ గ్లోబల్ షిప్‌మెంట్ వాల్యూ 2.5 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో షియోమీ Mi brand గ్లోబల్ షిప్‌మెంట్ వాల్యూ 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెం.1 గ్లోబల్ ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌

హువావే ఆన్‌లైన్ బ్రాండ్ Honor, నెం.1 గ్లోబల్ ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించరింది. 2017 మొదటి క్వార్టర్ ఫలితాలకు సంబంధించి IDC విడుదల చేసి రిపోర్ట్ ప్రకారం హానర్ బ్రాండ్‌కు సంబంధించి గ్లోబల్ షిప్‌మెంట్ వాల్యూ 2.5 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో షియోమీ Mi brand గ్లోబల్ షిప్‌మెంట్ వాల్యూ 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది.

యాపిల్‌ను కూడా క్రాస్ చేసేసింది...

యాపిల్ అమ్మకాలను కూడా హువావే క్రాస్ చేసినట్లు ఐడీసీ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 2016కు గాను హువావే హ్యాండ్‌సెట్‌ల గ్లోబల్ మార్కెట్ షేర్ 13.2%గా ఉండగా, యాపిల్ మార్కెట్ షేర్ కేవలం 12%గా ఉంది. స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారంలో గతకొన్ని సంవత్సరాలుగా సామ్‌సంగ్ నెంబర్ 1 మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

ఇండియన్ మార్కెట్ పై మరింత ఫోకస్...

భారత్‌లో హువావే స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు నిలకడగా కొనసాగుతున్నాయని, ఇది తమకు శుభపరిణామమని అల్లెన్ వాంగ్ తెలిపారు. రానున్న రోజుల్లో చైనాలో లాంచ్ అయ్యే హువావే హానర్ ఫోన్‌లను వీలైనంత త్వరగా భారత్‌లోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు

హువావే ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ (Honor) ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టి దాదాపుగా రెండున్నర సంవత్సరాలు కావొస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఈ బ్రాండ్ ఆఫర్ చేసే స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో డిమాండ్ ఉంటూనే ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Honor beats Mi to claim best online smartphone brand title globally. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot