విప్లవాత్మక ప్రాసెసర్‌తో Honor కొత్త ఫోన్, రేపే మార్కెట్లోకి

|

ఆధునిక స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని అనుసరించటంలో అగ్రగామి బ్రాండ్‌గా అవతరించిన honor తన ఇన్నోవేటివ్ సాంకేతికతతో దూసుకుపోతోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర విభాగంలో అత్యుత్తమ ఫోన్‌లను పరిచయం చేసిన హువావే బెస్ట్ సెల్లర్స్‌లో ఒకరిగా నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో బ్రాండ్ నుంచి విడుదలైన 'హానర్ 5ఎక్స్' ఓ సంచలనంగా నిలిచింది.

విప్లవాత్మక ప్రాసెసర్‌తో  Honor కొత్త ఫోన్, రేపే మార్కెట్లోకి

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్‌ను తొలిగా ప్రవేశపెట్టిన బ్రాండ్‌లలో హువావే హానర్ ఒకటి.హానర్ 5ఎక్స్ ఫోన్‌లో ఏర్పాటు చేసిన విప్లవాత్మక ప్రింట్ ప్రింట్ స్కానర్ వ్యవస్థ 5 వేరు‌ వేరు ఫింగర్ ప్రింట్‌లను రిజిస్టర్ చేసుకోగలదు. ఈ 5 పింగర్ ప్రింట్‌లను రకరకాల యాప్స్ ఇంకా టాస్క్‌లను అన్‌లాక్ చేసుకునేందుకు సెట్ చేసుకోవచ్చు. హువావే అందుబాటులోకి తీసుకువచ్చిన క్విక్ రెస్పాన్సివ్ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ మొత్తం యూజర్ ఎక్స్ పీరియన్స్‌నే మార్చేసింది.

Read More : HTC కంటే మోటరోలానే బెస్ట్!

విప్లవాత్మక ప్రాసెసర్‌తో  Honor కొత్త ఫోన్, రేపే మార్కెట్లోకి

విప్లవాత్మక ప్రాసెసర్‌తో Honor కొత్త ఫోన్, రేపే మార్కెట్లోకి

హువావే నుంచి విడుదలైన శక్తివంతమైన ఫోన్‌లలో హానర్ 7 ఒకటి. పవర్ ప్యాకుడ్ స్పెసిపికేషన్‌లతో విడుదలైన ఈ ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలానే, ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన సేఫ్ మోడ్ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు కావల్సిన ఫోటోలు, వీడియోలు, ఆడియోలు ఇంకా డాక్యుమెంట్ ఫైల్స్‌ను ద్వారా ఓ ఫోల్డర్‌లో భద్రపరుచుకుని పాస్‌వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీని సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

విప్లవాత్మక ప్రాసెసర్‌తో  Honor కొత్త ఫోన్, రేపే మార్కెట్లోకి

విప్లవాత్మక ప్రాసెసర్‌తో Honor కొత్త ఫోన్, రేపే మార్కెట్లోకి

తాజా పరిణామాల నేపథ్యంలో హువావే తన హానర్ బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌‌ఫోన్‌ను జూన్ 22న మార్కెట్లోకి తీసుకురాబోతోంది. హై పెర్ఫామెన్స్ 16ఎన్ఎమ్ ప్రాసెసర్‌తో కూడిన కైరిన్ 650 చిప్‌సెట్‌తో వస్తోన్నఈ ఫోన్ మరో గేమ్ ఛేంజర్ కాబోతోంది. స్మార్ట్‌ఫోన్‌లలో తొలినాళ్లలో 28nm ప్రాసెసింగ్ చిప్‌సెట్‌లను ఉపయోగించేవారు. కాలక్రమంలో వాటి స్థానాన్ని 20nm చిప్‌సెట్‌లు భర్తీ చేసేసాయి. ఇప్పుడు 20nm చిప్‌సెట్‌లు పాతబడిపోవటంతో వీటికి ప్రత్యామ్నాయంగా 16నానోమీటర్ ఫాబ్రికేషన్ నోడ్ చిప్‌సెట్‌లను అందుబాటులోకి తీసుకరావటం జరిగింది.

విప్లవాత్మక ప్రాసెసర్‌తో  Honor కొత్త ఫోన్, రేపే మార్కెట్లోకి

విప్లవాత్మక ప్రాసెసర్‌తో Honor కొత్త ఫోన్, రేపే మార్కెట్లోకి

2 గిగాహెర్ట్జ్ హై పెర్ఫామెన్స్ అలానే 1.7 లోవర్ పెర్ఫామెన్స్ కోర్‌ల‌తో పనిచేయగలగే కైరిన్ 650 చిప్‌సెట్ 40 శాతం తక్కువ శక్తిని ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగంతో పనిచేయగలదు. ఈ చిపెసెట్‌తో పెయిర్ చేయబడే మాలీ - టీ830 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ గేమింగ్ ప్రియులకు చక్కటి విందు. ఈ చిప్‌సెట్‌లో ఏర్పాటు చేసిన సిలికాన్ చిప్ లెవల్ ప్రొటెక్షన్ ఫోన్ సెక్యూరిటీకి పూర్తి భరోసాను ఇస్తుంది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన EMUI 4.1 ఓఎస్ పై ఫోన్ రన్ అవుతుంది.

విప్లవాత్మక ప్రాసెసర్‌తో  Honor కొత్త ఫోన్, రేపే మార్కెట్లోకి

విప్లవాత్మక ప్రాసెసర్‌తో Honor కొత్త ఫోన్, రేపే మార్కెట్లోకి

హానర్ ఫోన్ సరికొత్త మైలు రాయిని అందుకోబోతోంది. ఎందుకంటే..? మిడ్ రేంజ్ సిలికాన్ చిప్స్ విషయంలో క్వాల్కమ్, మీడియాటెక్ వంటి కంపెనీలు తమ ప్రాసెసర్‌లను 28ఎన్ఎమ్, 20 ఎన్ఎమ్ టెక్నాలజీతోనే అభివృద్ధి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 16ఎన్ఎమ్ FinFET ప్లస్ టెక్నాలజీతో రాబోతున్న హానర్ ఫోన్, స్మార్ట్ మొబైలింగ్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

Best Mobiles in India

English summary
Honor drives innovation in smartphone technology!. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X