7200mAh బ్యాటరీ, 16GB RAM, 90W ఛార్జింగ్, మూడు 50MP కెమెరాలతో HONOR GT ప్రో.. వచ్చేసింది..
HONOR GT Pro launch: టెక్నాలజీ ప్రియులకు, ముఖ్యంగా గేమర్స్‌కు శుభవార్త. HONOR సంస్థ తమ సరికొత్త పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ HONOR GT Proను చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. పోయిన సంవత్సరం వచ్చిన హానర్ GTకి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి దీని విశేషాలేంటో చూద్దామా?
* కళ్లు చెదిరే డిస్‌ప్లే
హానర్ GT Proలో 6.78 అంగుళాల పెద్ద LTPO OLED డిస్‌ప్లే అమర్చారు. ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది, కాబట్టి విజువల్స్ చాలా స్మూత్‌గా, స్పష్టంగా ఉంటాయి. ప్రత్యేకంగా, కళ్లపై ఒత్తిడి తగ్గించడానికి ఇందులో 4320Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ టెక్నాలజీని వాడారు.

దీనికి జర్మన్ TÜV రైన్‌ల్యాండ్ గ్లోబల్ ఐ ప్రొటెక్షన్ 4.0 సర్టిఫికేషన్ కూడా లభించింది. అంటే ఎక్కువ సేపు ఫోన్ వాడినా కళ్లకు అంతగా శ్రమ ఉండదు. ఇక దీని 6000 నిట్స్ HDR పీక్ బ్రైట్‌నెస్ ఎంతటి ఎండలోనైనా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
* రాకెట్ వేగంతో పనితీరు
ఈ ఫోన్‌లో సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ లీడింగ్ ఎడిషన్ చిప్‌సెట్ అమర్చారు. ఇది 3nm ప్రాసెస్‌పై తయారైంది. 4.47GHz వరకు స్పీడ్‌ను అందిస్తుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రినో 830 GPU ఉంది. మల్టీటాస్కింగ్, గేమింగ్ కోసం 12GB లేదా 16GB LPDDR5X RAM ఆప్షన్లు ఉన్నాయి.
అలాగే, మీ గేమ్స్, వీడియోలు, యాప్స్ స్టోర్ చేసుకోవడానికి 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ లభిస్తుంది. అంటే వేగం, స్టోరేజ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సిగ్నల్ నాణ్యతను మరింత మెరుగుపరచడానికి హానర్ సొంతంగా అభివృద్ధి చేసిన C1+ RF ఎన్‌హాన్స్‌మెంట్ చిప్ ను కూడా ఇందులో చేర్చారు.
* కూలింగ్‌లో కింగ్..
హెవీ గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి HONOR GT Proలో ఇండస్ట్రీలోనే అత్యుత్తమమైన మూడు-దశల రాకెట్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇందులో ప్రత్యేకమైన 3D వాటర్‌ఫాల్ వేపర్ ఛాంబర్, మెరుగైన స్టీమ్ ఫ్లో, అధునాతన థర్మల్ అథెసివ్, AI టెంపరేచర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీలు ఉన్నాయి.
ఫోన్‌లో ఉన్న 19 హీట్ సెన్సార్లతో ఇది గేమింగ్ సమయంలో కూడా ఉష్ణోగ్రతను తెలివిగా నియంత్రిస్తుంది. ఈ మొబైల్ ఫోటోగ్రఫీ కూడా అదుర్స్. ఫోటోలు, వీడియోలు ఇష్టపడేవారిని కూడా ఈ ఫోన్ నిరాశపరచదు. దీని వెనుక వైపు మూడు 50MP కెమెరాలు ఉన్నాయి.
* కెమెరాలు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక వైపున్న కెమెరాలు చూస్తే OISతో కూడిన వైడ్-యాంగిల్ మెయిన్ కెమెరా, అల్ట్రా-వైడ్ లెన్స్. 3x ఆప్టికల్ జూమ్, 50x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ చేసే టెలిఫోటో కెమెరా. ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక కెమెరాల లాగానే ముందు కెమెరా 4K 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
* భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్
హానర్ GT ప్రో స్మార్ట్‌ఫోన్ లో ఏకంగా 7200mAh భారీ కార్బన్-సిలికాన్ బ్యాటరీ అమర్చారు. ఇది 90W వైర్డ్ సూపర్ ఛార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ గంటలు వాడుకోవచ్చు, అలాగే ఛార్జింగ్ కూడా చాలా వేగంగా అయిపోతుంది.
* ఆపరేటింగ్ సిస్టమ్, ఇతర ఫీచర్లు
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0పై నడుస్తుంది. ఇందులో అధునాతన ఫీచర్లు చాలా ఉన్నాయి. అవి స్క్రీన్ కింద వేగవంతమైన అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, టీవీ, ఏసీ వంటివి కంట్రోల్ చేయడానికి IR బ్లాస్టర్, అద్భుతమైన సౌండ్ అనుభవం కోసం DTS:X అల్ట్రా సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు.
ప్రీమియం లుక్, మన్నిక కోసం మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు. హానర్ GT ప్రోకి IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే ఇది అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా పనిచేస్తుంది. ఇతర కనెక్టివిటీ ఫీచర్లలో డ్యూయల్ సిమ్, లేటెస్ట్ Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, GLONASS, NavIC వంటి నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి.
* రంగులు, ధరలు
ఈ ఫోన్ మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ఐస్ క్రిస్టల్ వైట్, ఫాంటమ్ బ్లాక్, బర్నింగ్ స్పీడ్ గోల్డ్. చైనాలో ధరలు చూస్తే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లు (సుమారు రూ.43,000, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగా నిర్ణయించారు.
16GB RAM + 512GB ధర 4,299, 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర 4,799 యువాన్లుగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది. త్వరలో ఇతర దేశాలలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








