ఆ రెండు ఫోన్‌లలో బ్లాక్‌బస్టర్ ఎవరు..?

Written By:

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ఫోన్‌ల కోలాహలం తారా స్థాయికి చేరుకుంది. బెస్ట్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలలో ఒకటైన Huawei తన హానర్ బ్రాండ్ నుంచి 'హోలీ 2 ప్లస్' పేరుతో సరికొత్త బడ్జెట్ రేంజ్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

 ఆ రెండు ఫోన్‌లలో బ్లాక్‌బస్టర్ ఎవరు..?

బడ్జెట్ కాంపిటీటర్‌గా బరిలోకి దిగిన ఈ డివైస్ ధర రూ.8,499. శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో ఈ ఫోన్ షియోమీ రెడ్మీ 3 ఫోన్‌కు ప్రత్యక్ష కాంపిటీటర్‌గా నిలిచింది. ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి spec comparisonను ఇప్పుడు చూద్దాం...

Read More : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా..? వీటి కోసం ఆగి తీరాల్సిందే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ రెండు ఫోన్‌లలో ఎవరు బ్లాక్‌బస్టర్..?

ఈ రెండు ఫోన్‌లు 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ హైడెఫినిషన్ స్ర్కీన్‌లతో వస్తున్నాయి. డిస్‌ప్లే రిసల్యూషన్ వచ్చేసరికి 1280 x 720పిక్సల్స్. బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇంకా కలర్స్ విషయంలో స్వల్ప తేడాలను ఈ రెండు ఫోన్‌ల డిస్‌ప్లేల మధ్య మనం గమనించవచ్చు.

ఆ రెండు ఫోన్‌లలో ఎవరు బ్లాక్‌బస్టర్..?

హార్డ్‌వేర్ డిపార్ట్‌మెంట్‌లో ఈ రెండు ఫోన్ల మధ్య ప్రధాన తేడాలను మనం గమనించవచ్చు. హువావే హానర్ 2 ప్లస్ MT6735 క్వాడ్‌కోర్ చిప్‌సెట్‌తో వస్తోండగా, రెడ్మీ 3 శక్తివంతమైన Snapdragon 616 ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ విభాగంలో రెడ్మీ 3దే పైచేయిగా భావించవచ్చు. 

ఆ రెండు ఫోన్‌లలో ఎవరు బ్లాక్‌బస్టర్..?

ఈ రెండు ఫోన్‌లు 2జీబి ర్యామ్‌తో వస్తున్నాయి. 16జీబి ఇంటర్నెట్ స్టోరేజ్ అవకాశాన్ని ఈ రెండు డివైస్‌లలో కల్పించారు. ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ విషయానికొచ్చేసరికి హానర్ హోలీ 2 ప్లస్‌లో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకోవచ్చు. ఇదే సమయంలో రెడ్మీ 3లో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా స్టోరేజ్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు.

అయితే, ఇక్కడో నెగిటివ్ పాయింట్ కూడా ఉంది. రెడ్మీ 3లో ఏర్పాటు చేసిన రెండవ సిమ్ స్లాట్‌ను మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్‌గా ఉపయోగించుకోవల్సి ఉంటుంది. ఫోన్‌లో మైక్రోఎస్డీ కార్డ్ ఉంచినట్లయితే కేవలం ఒక్క సిమ్ మాత్రమే పనిచేస్తుంది. మరో వైపు హువావే తన హోలీ 2 ప్లస్ ఫోన్‌లో మూడు సిమ్‌స్లాట్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో రెండింటిని సిమ్ కార్డ్‌లకు కేటాయించగా, మరొక స్లాట్‌ను మైక్రోఎస్డీ కార్డ్‌కు కేటాయించారు.

 

ఆ రెండు ఫోన్‌లలో ఎవరు బ్లాక్‌బస్టర్..?

హానర్ హోలీ 2 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా, రెడ్మీ 3 కొంచం పెద్దదైన 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ రెండు ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి.

 

ఆ రెండు ఫోన్‌లలో ఎవరు బ్లాక్‌బస్టర్..?

ఈ రెండు ఫోన్‌లలో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాలతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను మనం చూడొచ్చు. ఎల్ఈడి ఫ్లాష్, PDAF వంటి కెమెరా ఆప్టిక్స్‌ను ఈ రెండు డవైస్ లలో ఒకేలా ఉంటాయి.

 

ఆ రెండు ఫోన్‌లలో ఎవరు బ్లాక్‌బస్టర్..?

ఈ రెండు ఫోన్‌లు 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయి. డ్యుయల్ సిమ్, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ రెండు ఫోన్‌లలో మనం చూడొచ్చు.

 

ఆ రెండు ఫోన్‌లలో ఎవరు బ్లాక్‌బస్టర్..?

ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్నప్పటికి వేటికవే సొంత యూజర్ ఇంటర్ ఫేస్‌లను కలిగి ఉన్నాయి. హానర్ హోలీ 2 ప్లస్ తన సొంత EMUI 3.1 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తుండగా, షియోమీ రెడ్మీ 3 తన సొంత MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది.

 

ఆ రెండు ఫోన్‌లలో ఎవరు బ్లాక్‌బస్టర్..?

హానర్ హోలీ 2 ప్లస్ రూ.8,499 ధర ట్యాగ్‌తో మార్కెట్లో లభ్యమవుతుండగా, రెడ్మీ 3 రూ.7,490 ధర ట్యాగ్‌తో మార్కెట్లో లభ్యమవుతోంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor Holly 2 Plus vs Xiaomi Redmi 3: Which Budget phone gives more power to users!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot