హానర్ కొత్త ఫోన్ వచ్చేసింది, తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్

హువావే సబ్సిడరీ బ్రాండ్ హానర్ (Honor), సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. హానర్ హోలీ 3 ప్లస్ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.12,999. అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్ దొరుకుతుంది. స్పసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే, ప్రాసెసర్,

హానర్ హోలీ 3 ప్లస్ 5.5 అంగుళాల హై-డెఫినిషన్ డిస్‌ప్లే ‌వస్తోంది. రిసల్యూషన్ కెపాసిటీ 720x1280 పిక్సల్స్, 1.2GHz Kirin 620 octa-core CPU

ర్యామ్, స్టోరేజ్

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్‌‌వేర్

హానర్ హోలీ 3 ప్లస్ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశం ఉంది. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3100mAh బ్యాటరీ.

ఫోన్ ఇతర ఫీచర్లు...

4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్ స్పాట్, మైక్రోయూఎస్బీ, బ్లుటూత్ వీ4.0, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, డిజిటల్ కంపాస్, జీ-సెన్సార్, ఫోన్ బరువు 168 గ్రాములు, చుట్టుకొలత 154x77.1x8.45 మిల్లీ మీటర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor Holly 3+ launched in India: Price, specifications and other features. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot