3జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 5,500 తగ్గింది

|

హువాయి సబ్ బ్రాండ్ హానర్ 2016 అక్టోబర్లో Honor Holly 3 పేరుతో 2/3జిబి ర్యామ్ ఫోన్లను లాంచ్ చేసిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 2 జిబి ర్యామ్ ఫోన్ ధర రూ. 9, 999, అలాగే 3జిబి ర్యామ్ ఫోన్ ధర రూ. 12,999తో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. కాగా ఈ ఫోన్లు ఇప్పుడు భారీ తగ్గింపును పొందాయి. 3జిబి ర్యామ్ ఫోన్ ధరపై కంపెనీ రూ. 5,500 తగ్గింపును అందిస్తోంది. అలాగే 2జిబి ర్యామ్ ఫోన్ మీద రూ. 3వేల తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అలాగే అమెజాన్లో వరుసగా రూ. 7,499, రూ. 6,499 ధరల్లో లభిస్తున్నాయి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను చూస్తే 5.5 inch HD displayతో పాటు octa-core Kirin 620 processorని పొందుపరిచారు.

 
3జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 5,500 తగ్గింది

ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ కైరిన్ 620 ప్రాసెస‌ర్‌, మాలి 450 గ్రాఫిక్స్
2/3 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ

అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 6, ఆసక్తిని రేకెత్తిస్తున్న లీకులుఅదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 6, ఆసక్తిని రేకెత్తిస్తున్న లీకులు

ఈ ఫోన్ తర్వాత కంపెనీ హానర్ హాలీ 3 ప్లస్' పేరిట ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.13,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఇప్పుడు లభిస్తున్నది. ఇది కూడా ఇప్పుడు తగ్గింపు ధరలో లభిస్తోంది. దీని థర అమెజాన్లో రూ. 8,499గా ఉంది. ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేయవచ్చు.
హువావే హానర్ హాలీ 3 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Honor Holly 3 price slashed in India by upto Rs 5,500 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X