Home
Mobile

ఆరు కెమెరాలతో లాంచ్ అయిన Honor Magic 2 స్మార్ట్‌ఫోన్ ధర ఎంతంటే...?

హువాయి సబ్సిడరీ బ్రాండ్ హానర్ మరో శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లోకి రోజు లాంచ్ చేసింది. Honor Magic 2 పేరుతో ఫోన్ ను విడుదల చేసింది.

హువాయి సబ్సిడరీ బ్రాండ్ హానర్ మరో శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లోకి రోజు లాంచ్ చేసింది. Honor Magic 2 పేరుతో ఫోన్ ను విడుదల చేసింది.అయితే ఈ ఫోన్ ఆరు కెమెరాలతో రావడం మరో విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రేడియెంట్ బ్లాక్‌, గ్రేడియెంట్ రెడ్, గ్రేడియెంట్ బ్లూ క‌ల‌ర్ వేరియెంట్ల‌లో విడుద‌ల కాగా న‌వంబ‌ర్ 6వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు. ఈ ఫోన్ ఫీచర్లను ఒక సారి పరిశీలిస్తే...

Honor Magic 2 ఫీచ‌ర్లు...

Honor Magic 2 ఫీచ‌ర్లు...

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 24, 16 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16, 2, 2 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ సెల్ఫీ కెమెరాలు, 3డీ ఫేస్ అన్‌లాక్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఐపీఎక్స్‌2 వాట‌ర్ ప్రొటెక్ష‌న్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ చార్జ్‌.

 

 

ధర...

ధర...

ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.40,295గా ఉంది. అలాగే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.45,610 గా ఉండ‌గా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.50,910గా ఉంది.

6.39 ఇంచుల భారీ డిస్‌ప్లే....

6.39 ఇంచుల భారీ డిస్‌ప్లే....

6.39 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 9.0 పై ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

వెనుక భాగంలో 16, 24, 16 మెగాపిక్స‌ల్ కెమెరాలు....

వెనుక భాగంలో 16, 24, 16 మెగాపిక్స‌ల్ కెమెరాలు....

ఈ ఫోన్ వెనుక భాగంలో 16, 24, 16 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉండ‌గా, ముందు భాగంలో 16, 2, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో ఉన్న కెమెరాల‌కు 3డీ ఫేస్ అన్‌లాక్‌, 3డీ క్యూమోజీ స‌దుపాయం క‌ల్పించారు.

3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ....

3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ....

ఈ ఫోన్‌లో ఉన్న 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ 40 వాట్ల సూప‌ర్ చార్జ్ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉంది. దీని వ‌ల్ల బ్యాట‌రీ 0 నుంచి 50 శాతం చార్జింగ్ అయ్యేందుకు కేవ‌లం 15 నిమిషాలు మాత్ర‌మే స‌మ‌యం ప‌డుతుంది. అలాగే 0 నుంచి 85 శాతం చార్జింగ్ పూర్త‌య్యేందుకు కేవ‌లం 30 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ప‌డుతుంది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Honor Magic 2 slider arrives with six cameras and UD fingerprint scanner.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X