Home
Mobile

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో కొత్త ట్రెండ్ సృష్టించబోతున్న Honor Magic 2

గత కొద్ది సంవత్సరాల నుంచి స్మార్ట్‌ఫోన్ల యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.

గత కొద్ది సంవత్సరాల నుంచి స్మార్ట్‌ఫోన్ల యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.అవి కమ్యూనికేషన్స్ కోసమే కాకుండా అన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా మినీ కంప్యూటర్ లా ఉండే వాటిని అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే టాప్ కంపెనీలు కూడా వినియోగదారుల కనుగుణంగానే ఫీచర్లను అందిస్తూ సరికొత్తగా మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్లను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా హానర్ కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త టెక్నాలజీతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చైనా మార్కెట్లోకి Honor Magic 2 పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

honor magic2-1

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Honor Magic 2 మోస్ట్ యాంటిసిపెటెడ్ ఫోన్ ఎందుకంటే హానర్ కంపెనీ ఈ ఫోన్ ను చాలా మొడెర్న్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ తో తయారు చేసింది.లుక్ ఇంకా ఫీల్ పరంగా Honor Magic 2 పూర్తిస్థాయిలో ఆకట్టుకుంటుంది.

honor magic2-1

Next-generation AI-dedicated Kirin 980 with latest Android Pie

Honor Magic 2 స్మార్ట్‌ఫోన్‌కు 'Kirin 980 ఏఐ సీపీయూ' ప్రధానమైన బ్యాక్‌బోన్ అని చెప్పుకోవచ్చు. హువావే బ్రాండ్ నుంచి సొంతంగా అభివృద్ధి చేయబడిన ఈ మొబైల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్, డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌‌ (ఎన్‌పీయూ)తో కంబైన్ అయి ఉండటంతో మరింత శక్తివంతమైన వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌‌ అనేది ఫోటోగ్రఫీ, మీడియా ప్లేబ్యాక్, బ్యాటరీ కన్సంప్షన్, గేమింగ్ తదితర విభాగాల పనితీరు పై ప్రత్యేకమైన శ్రద్థ తీసుకుంటుంది.

ఈ ఫోన్‌లో పొందుపరిచిన Kirin 980 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌సెట్‌కు శక్తివంతమైన 6జీబి,8జిబి ర్యామ్ వ్యవస్థ తోడవటంతో ఆసాధారణ వేగంతో ఫోన్ ప్రాసెసింగ్ దూసుకుపోతోంది. ఈ ఫోన్‌లో యాప్ లోడింగ్ దగ్గర నుంచి బేసిక్ యూఐ నేవిగేషన్ వరకు అనేక రకాల రొటీన్ టాస్కులు రెప్పపాటులో జరిగిపోతాయి.

Honor Magic 2 యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా రిచ్ గానూ, ఇదే సమయంలో యూజర్ ఫ్రెండ్లీగానూ అనిపిస్తుంది. Android Pie ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్ది చేసినEMUI 9.0 కస్టమైజిడ్ స్కిన్ అనేక ఉపయోగకర ఫీచర్లతో ఎటువంటి కన్ఫ్యూజన్‌కు గురి చేయకుండా ఫోన్ ను ముందుకు నడిపిస్తుంది.

honor magic2-1

100% Screen-to-body ratio

Honor Magic 2 స్మార్ట్‌ఫోన్ 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తోంది. 100% స్క్రీన్ టు బాడీ రేషియో ఈ డిస్‌ప్లేకు మరో హైలైట్‌గా నిలిచింది. ఈ పెద్ద డిస్‌ప్లే కంఫర్టబల్ వ్యూవింగ్‌కు మరింత అనుకూలంగా ఉంది. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేస్తోన్న విజువల్స్ అవుట్ డోర్ కండీషన్స్‌లో సైతం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ అన్ని విభాగాల్లో ఆకట్టుకునే ప్రదర్శనను కనబరుస్తోంది.

honor magic2-1

AI-empowered six-lens camera setup

Honor Magic 2 ఫోన్‌లో సెటప్ చేసిన 6 -లెన్స్ కెమెరా సెట్ అప్ మరో అద్భుతం అని చెప్పుకోవాలి. ఈ ఫోన్ 16+24+16 మెగా పిక్సల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఎక్విప్ కాబడిన ఈ ట్రిపుల్ కెమెరా యూనిట్ షూటింగ్ కండిషన్స్ పై మరింత కంట్రోలింగ్‌ను కలిగి ఉంది.మనం క్యాప్చుర్ చేయాలనుకునే విజువల్స్‌కు సంబంధించి బెస్ట్ అవుట్ పుట్‌ను రాబట్టే క్రమంలో Honor Magic 2 ఫోన్‌ కెమెరా సెట్టింగ్స్‌ను కవాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకునే వీలును కల్పించారు. Honor Magic 2తో క్యాప్చుర్ చేస్తోన్న ఫోటోలు నాణ్యమైన డిటెయిలింగ్‌ను ఆఫర్ చేస్తాయి. తక్కువ వెళుతురు కండీషన్స్‌లో కూడా ఈ కెమెరా పనితీరు అత్యుత్తమంగా ఉండబోతుంది.

honor magic2-1

YOYO పవర్ ఫుల్ వర్చువల్ అసిస్టెంట్

Honor Magic 2 నూతనంగా అభివృద్ధి చెందిన వర్చ్యువల్ అసిస్టెంట్ YOYO ను పరిచయం చేస్తుంది. ఇది కంప్యూటర్ విజన్ , నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ , అంతేకాక నిర్ణీత మరియు సిఫారసు విధానాలతో కూడిన ఒక స్మార్ట్-మొబైల్ యూజర్ అనుభవాన్ని అందిస్తుంది.

honor magic2-1

40W సూపర్ ఛార్జ్ టెక్నాలజీ మరియు ఫ్యూచర్ రెడీ కనెక్టివిటీ

లేటెస్ట్ గా Mate 20 Pro లో ఎక్విప్ చేసిన 40W సూపర్ ఛార్జ్ టెక్నాలజీనీ ఈ Honor Magic 2 లో కూడా ఎక్విప్ చేసారు. ఈ ఫోన్‌లో ఎక్విప్ చేసిన 3,500 mAh బ్యాటరీ, బ్యాకప్ పరంగా హెవీ యూసేజ్‌ను సైతం తట్టుకుని నిలబడగలుగుతుంది.

Best Mobiles in India

English summary
Honor Magic 2: Start of a new Era in the smartphone industry.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X