Home
Mobile

హానర్ మ్యాజిక్ 6 ప్రో యూజర్లకు MagicOS 9 అప్‌డేట్.. కొత్త ఫీచర్లు ఇవే!

By Ram Kumar

హానర్ మ్యాజిక్ 6 ప్రో యూజర్లకు గుడ్ న్యూస్. మీ ఫోన్ మరింత స్మార్ట్ అవ్వడానికి మ్యాజిక్ఓఎస్ 9 (MagicOS 9) అప్‌డేట్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ 15తో పనిచేసే ఈ అప్‌డేట్, మీ ఫోన్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుంది. కొత్త ఫీచర్లు, మెరుగైన పెర్ఫార్మెన్స్, స్టైలిష్ డిజైన్‌తో హానర్ మ్యాజిక్ 6 ప్రో ఇప్పుడు మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుంది.

హానర్ కంపెనీ ఇటీవలే ఈ అప్‌డేట్‌ను హానర్ మ్యాజిక్ 6 ప్రో వినియోగదారులకు విడుదల చేయడం ప్రారంభించింది. దీంట్లో భాగంగా వచ్చే ఫీచర్లేవో చూద్దాం.

Honor Magic 6 Pro receives MagicOS 9 update with AI Translate and new features

* AI ఫీచర్లు

ఈ అప్‌డేట్‌లోని హైలైట్ AI ఫీచర్లు. మీటింగ్స్‌లో ఇతరులతో మాట్లాడటం కష్టంగా ఉందా? AI ట్రాన్స్‌లేట్ (ఇంటర్‌ప్రెటర్ మోడ్)తో రియల్ టైమ్‌లో ట్రాన్స్‌లేషన్ పొందవచ్చు. మరి AI ఫీచర్ లూప్ రికార్డింగ్‌తో, పదే పదే ట్యాప్ చేయకుండానే సంభాషణలను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.

మ్యాజిక్ పోర్టల్ ఒక మ్యాజిక్ లాంటిది. మీ వేలితో సర్కిల్ గీస్తే చాలు, గూగుల్ ట్రాన్సలేట్, యూట్యూబ్ వంటి యాప్స్‌ను క్షణాల్లో ఓపెన్ చేయవచ్చు. అంతేకాదు, నోట్స్‌లో వాయిస్‌ను టెక్స్ట్‌గా మార్చడం, టెక్స్ట్‌ను ట్రాన్స్‌లేట్ చేయడం, కాల్ క్వాలిటీని పెంచే AI నాయిస్ రెడక్షన్, కంటి ఒత్తిడిని తగ్గించే AI డిఫోకస్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

* బెటర్ యానిమేషన్స్

విజువల్స్‌ విషయానికొస్తే, అప్‌డేట్ తర్వాత మీ ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది. నోటిఫికేషన్లు, కంట్రోల్ సెంటర్, మీడియా కార్డ్స్, కాల్ అలర్ట్స్.. అన్నీ కొత్త యానిమేషన్లతో కట్టిపడేస్తాయి. టచ్ చేస్తే ఫీల్‌ సూపర్‌ ఉంటుంది. యాప్స్ కూడా ఫాస్ట్‌గా ఓపెన్ అవుతాయి.

* స్టైల్‌కి తగ్గట్టుగా ఫోన్:

MagicOS 9 అప్‌డేట్‌తో మీ ఫోన్‌ను మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.

సింపుల్ కస్టమైజేషన్: హోమ్ స్క్రీన్ లేదా లాక్ స్క్రీన్‌పై రెండు వేళ్లతో పిన్చ్ చేసి థీమ్స్, ఐకాన్స్, లేఅవుట్స్‌ను క్షణాల్లో మార్చుకోవచ్చు.

కొత్త డిజైన్: క్యాలెండర్, నోట్స్ వంటి యాప్స్‌లో సరికొత్త కలర్ స్కీమ్స్, డిజైన్స్ మీ ఫోన్‌కు కొత్త రూపాన్ని ఇస్తాయి.

* మరింత పవర్‌ఫుల్ కెమెరా

ఫ్యాన్-షేప్డ్ జూమ్: జూమ్ చేయడం ఇప్పుడు మరింత సులువుగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

సింపుల్ టూల్‌బార్: AI ఫొటోగ్రఫీ, వీడియో రిజల్యూషన్ సెట్టింగ్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

* ఇంకా చాలా ఉన్నాయి!

ఈ అప్‌డేట్‌లో మరిన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

రెయిన్‌ప్రూఫ్ టచ్: వర్షంలో లేదా తడి చేతులతో కూడా స్క్రీన్‌ను సులభంగా ఉపయోగించవచ్చు.

స్మార్ట్ రిమోట్ యాప్: డివైజ్‌లను కంట్రోల్ చేయడం మరింత సులభం అవుతుంది.

బ్యాటరీ ఆప్టిమైజేషన్: బ్యాటరీ లైఫ్ పెంచడానికి పవర్ సేవింగ్ టిప్స్, సొల్యూషన్స్ అందుబాటులో ఉంటాయి.

ఈ 9.0.0.131 (C185E10R2P2) వెర్షన్ అప్‌డేట్, భారతదేశంలోని హానర్ మ్యాజిక్ 6 ప్రో యూజర్లకు మరింత ఫాస్ట్, స్మార్ట్, కస్టమైజబుల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor Magic 6 Pro receives MagicOS 9 update with AI Translate and new features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X