180MP కెమెరా, 512GB స్టోరేజీ, 5600mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.. సేల్ ఎప్పుడంటే?
హానర్ మేజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ (Honor Magic 6 Pro Smartphone) భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ప్లాగ్‌షిగ్ ధరలో అందుబాటులోకి వచ్చింది. 12GB ర్యామ్ + 512GB స్టోరేజీతో లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్ 180MP కెమెరాను కలిగి ఉంటుంది. నానోక్రిస్టల్ గ్లాస్ రక్షణ పొందుతుంది. బ్యాటరీ నిర్వహణ కోసం ప్రత్యేక హానర్ E1 చిప్‌ను కలిగి ఉంది. 5600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 40 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని సంస్థ చెబుతోంది. ఆగస్టు 15 నుంచి సేల్ ప్రారంభం కానుంది.
హానర్ మేజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
హానర్ మేజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz అడాప్టివ్ డైనమిక్ రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల OLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. 5000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ డిస్‌ప్లే నానోక్రిస్టల్ గ్లాస్‌తో రక్షణ కలిగి ఉంటుంది. డ్రాప్ రెసిస్టెంట్ కంటే 10 రెట్లు పటిష్ఠంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. మరియు స్విచ్ SGS మల్టీ స్క్రీన్ 5 స్టార్ రేటింగ్‌తో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ హానర్ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Adreno 750 GPU తో జతచేయబడుతుంది. 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.0 స్టోరేజీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Magic UI 8.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

ఈ హ్యాండ్‌సెట్ 2 జెన్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతోపాటు హానర్ E1 చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ చిప్ బ్యాటరీని మెరుగ్గా నియంత్రిస్తుందని మరియు ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ వచ్చేలా పనిచేస్తుందని సంస్థ చెబుతోంది. 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లో అందుబాటులో ఉంది.
ఈ హానర్ స్మార్ట్‌ఫోన్ 80W వైర్, 66W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5600mAh బ్యాటరీ ని కలిగి ఉంటుంది. వైర్ ఛార్జర్ ద్వారా కేవలం 40 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చని హానర్ చెబుతోంది. ఈ ఫోన్ కేవలం 10 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఉన్న సమయంలోనూ మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా సక్రమంగా పనిచేస్తుందని సంస్థ తెలిపింది.
50MP+180MP+50MP కెమెరాలు:
కెమెరా విభాగం పరంగా ఈ హానర్ మేజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. f1.4 - f/2.0 అపేచర్‌తో 50MP కెమెరా, 2.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో 1/1.49 అంగుళాల 180MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ మరియు 50MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చారు.
ఈ హానర్ మేజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే స్టోరేజీ వేరియంట్లో అందుబాటులో ఉంది. 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ మోడల్ ధర రూ.89999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 15 నుంచి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, Epi గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. 180 రోజుల వరకు ధర తగ్గింపు ఉండదని సంస్థ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications








