హానర్ మేజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ లీక్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు..!
హానర్ నుంచి చైనాలో జనవరిలో హానర్ మేజిక్ 6 మరియు మేజిక్ 6 ప్రో ( Honor Magic 6 Pro Smartphone ) హ్యాండ్ సెట్ లు విడుదల అయ్యాయి. భారత్‌లోనూ ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే హానర్ సంస్థ మాత్రం విడుదలపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
అయితే ఓ టిప్‌స్టర్ నివేదిక ప్రకారం హానర్ మేజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ జులైలో భారత్ మార్కెట్లోకి విడుదల కానుందని తెలుస్తోంది. HTech సీఈవో మాధవ్ సేత్ కూడా ఈ హ్యాండ్‌సెట్ విడుదలపై హింట్ ఇచ్చారు. దీంతోపాటు టిప్‌స్టర్ పరాస్ గుల్గానీ తాజా X పోస్టు్ (ట్వీట్) ఆధారంగా హానర్ మేజిక్ 6 సిరీస్ త్వరలో విడుదల కానుందని చెప్పారు.

హానర్ మేజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా భారత్‌లో జులైలో విడుదల కానుందని తెలిపారు. దీంతోపాటు హానర్ ఫోల్డబుల్ సిరీస్ కూడా త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. దీంతోపాటు వివో నుంచి వివో X ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల కానుంది.
హానర్ మేజిక్ V2 మరియు హానర్ మేజిక్ V2 RSR స్పెసిఫికేషన్‌లు :
హానర్ మేజిక్ V2 మరియు హానర్ మేజిక్ V2 RSR రెండు వేరియంట్‌లు 6.43 అంగుళాల కవర్ డిస్‌ప్లే మరియు 7.92 అంగుళాల ఇన్నర్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ రెండు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 13 ఆధారిత మేజిక్ OS 7.2 పైన పనిచేయనున్నాయి. మరియు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC చిప్‌సెట్ పైన పనిచేయనున్నాయి. దీంతోపాటు 16GB ర్యా్మ్ మరియు గరిష్ఠంగా 1TB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది.
హానర్ మేజిక్ V2 సిరీస్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 20MP టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 66W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
హానర్ మేజిక్ V2 RSR ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ యూరప్‌లో 16GB ర్యామ్ + 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర EUR 2699 (భారత కరెన్సీ ప్రకారం రూ.2,42,000) గా ఉంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు కేవలం 9.9mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంటాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








