Home
Mobile

భారత్‌ మార్కెట్‌లోకి మరో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌.. స్పెసిఫికేషన్‌ల పూర్తి వివరాలు..!

భారత్ మార్కెట్‌లోకి అనేక స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు క్రమంగా ఫోల్డబుల్‌ మార్కెట్‌ను లక్ష్యంగా పనిచేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి హానర్‌ సంస్థ చేరనుంది. హానర్‌ మేజిక్‌ V2 ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను (Honor Magic V2 Foldable Smartphones) ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. తాజాగా త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి విడుదల కానుందని తెలుస్తోంది.

ఇందులో భాగంగా హానర్‌ మేజిక్‌ V2 మరియు హానర్‌ మేజిక్‌ V2 RSR ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ లు లాంచ్ కానున్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌ ల విడుదలకు సంబంధించి CEO మాధవ్‌ సేత్‌ హింట్‌ ఇచ్చారు. అయితే భారత్‌ మార్కెట్‌లో కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందో వెల్లడించలేదు.

Honor magic V2 foldable smartphones teased

హానర్‌ మేజిక్ V2 మరియు హానర్‌ మేజిక్‌ V2 RSR స్పెసిఫికేషన్‌లు :
హానర్‌ మేజిక్ V2 మరియు హానర్‌ మేజిక్‌ V2 RSR రెండు వేరియంట్‌లు 6.43 అంగుళాల కవర్‌ డిస్‌ప్లే మరియు 7.92 అంగుళాల ఇన్నర్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ రెండు ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ లు ఆండ్రాయిడ్ 13 ఆధారిత మేజిక్ OS 7.2 పైన పనిచేయనున్నాయి. మరియు స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ పైన పనిచేయనున్నాయి. దీంతోపాటు 16GB ర్యా్మ్‌ మరియు గరిష్ఠంగా 1TB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది.

హానర్‌ మేజిక్‌ V2 సిరీస్ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ సెన్సార్‌, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 20MP టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 66W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

హానర్‌ మేజిక్‌ V2 RSR ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌ యూరప్‌ లో 16GB ర్యామ్‌ + 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర EUR 2699 ( భారత కరెన్సీ ప్రకారం రూ.2,42,000 ) గా ఉంది. ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లు కేవలం 9.9mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంటాయి.

** దీంతోపాటు హానర్‌ 200 ప్రో ఈ సంవత్సరం చివరలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. హానర్ 200తోపాటు ఈ మోడల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మోడళ్ల వివరాలు కొన్ని లీక్‌ అయ్యాయి. బ్లూ, గ్రీన్ మరియు వైట్‌ రంగుల్లో ప్రో మోడల్‌ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

ఈ హానర్‌ 200 ప్రో మోడల్‌ హ్యాండ్‌సెట్ f/1.9-2.4 అపేచర్‌తో మరియు 50X డిజిటల్‌ జూమ్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు స్నాప్‌ డ్రాగన్ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ పై పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే హానర్‌ 200 మరియు హానర్‌ 200 ప్రో మోడళ్లు చైనాలో తొలుత విడుదల కానున్నాయని తెలుస్తోంది. అనంతరం ఇతర మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor magic V2 foldable smartphones teased by CEO and expected to launch in india soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X